India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 1,916 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. కౌంటింగ్ కు పాలమూరు యూనివర్సిటీలో ఏడు హాళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 21 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

కన్న పిల్లల మృతికి కారణమైన తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి కుంటాల సునీత తీర్పు వెల్లడించారు. నందిపేటకు చెందిన అమృత 2022 ఫిబ్రవరి 28న గుత్ప కెనాల్‌లో తన పిల్లలను పారేసి తాను దూకింది. ఓ కానిస్టేబుల్ ఆమెను రక్షించగా పిల్లలు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి ఈ మేరకు తీర్పు చెప్పారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,550 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్న, ఈ రోజు మిర్చి ధర, పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని అధికారులు సూచించారు.

కరీంనగర్ DSP రమణామూర్తి కీలక ప్రకటన చేశారు. లంచం అడిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు 9154388954, 08782243693 నంబర్లను సంప్రదించాలని అన్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన HNKజిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఈనెల 10న HYDవచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. కాగా ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వరంగల్ జిల్లా వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

చింతకాని మండలం అనంతసాగర్ సమీపంలో మల్లెల కుటుంబరావు (30) అనే వ్యక్తి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంకు చెందిన కుటుంబరావు కొంతకాలంగా అత్తగారి ఊరైన అనంతసాగర్లో నివసిస్తున్నాడు. సోమవారం ఓ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై పారుపల్లి భాస్కర్ రావు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ముందునుంచి టికెట్ ఆశించిన వారు.. ఇప్పుడు పోటీచేయబోమని చెప్పేయగా, మరొకరికి టికెట్ ఇద్దామని పార్టీ ఆలోచిస్తే.. ఆయన పార్టీ మారుతారన్న చర్చ జరుగుతోంది. భువనగిరి టికెట్ ను బీసీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా తర్జనభర్జన పడుతోంది.

యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన హసన్పర్తిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువతి టెలీకాలర్ ఉద్యోగం కోసం ఈనెల 10న HYD వచ్చి MGBS బస్టాండ్‌లో వేచి చూస్తోంది. ఈక్రమంలో ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి వంగపహాడ్‌కు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయాలంటూ దాడికి పాల్పడ్డారు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

MP ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వివిధ శాఖల సిబ్బందికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బందికి సంబంధించిన ఇంటి చిరునామాలు, ఎపిక్ కార్డుల వివరాలు తప్పనిసరిగా అందించాలన్నారు. సిబ్బందికి సెలవులు ఇవ్వరాదని సూచించారు. ఈ మీటింగ్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఉన్నారు.

చావు గురించి తప్పుడు సమాచారం ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. బోథ్‌కు చెందిన నరసింహదాస్, బాపు ఇద్దరు అన్నదమ్ములు. అనారోగ్యంతో బాధపడుతున్న బాపు బతికే ఉన్నా, ఆయన చనిపోయాడంటూ బంధువులు ఫోన్ చేసి చెప్పడంతో తమ్ముడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అన్న ఇక లేడని రోదించిన దాస్ గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నింపింది.
Sorry, no posts matched your criteria.