India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంటర్ మూల్యాంకనం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి NLG ప్రభుత్వ జూ. కళాశాల (బాలుర)లో మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో ముగియనుంది. వివిధ జిల్లాల నుంచి ఐదు లక్షల పేపర్లు మూల్యాంకనం కోసం జిల్లాకు వచ్చాయి. మ్యాథ్స్ 180, ఇంగ్లిష్ 165, తెలుగు 140, సివిక్స్ 75 సంస్కృతం 40, హిందీ సబ్జెక్టు ను ఐదుగురు అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్‌మెంట్ 2, 4, 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఈనెల 22లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ సోమవారం తెలిపారు. అపరాధ రుసుము రూ.300తో మార్చి 27 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

ఢిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ కవిత..ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంతో భాగస్వామి అయ్యారని ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి కవిత, మరికొందరితో కలిసి ఆప్ అగ్రనేతలతో కుట్రపన్నారని ఈడీ పేర్కొంది. కాగా ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ రాజీనామాతో WGL BRSకు సారథి లేకుండా పోయింది. WGL తూర్పు నియోగజకవర్గంలోని పలువురు కీలక నేతలు, కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. మాజీ MLA నరేందర్ సైతం ఎన్నికల అనంతరం స్తబ్దుగా ఉండిపోవడంతో జిల్లాలో సమస్యలు వస్తే చెప్పుకోవడానికి నాయకుడికోసం వారంతా ఎదురు చూస్తున్నారు. దీంతో మాజీ MLAలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

తాంసి ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఎటువంటి అనుమతి లేకుండా గైర్హాజరు అవుతున్నట్లు ఆమె గుర్తించారు. పరీక్షల సమయంలో వార్డెన్ గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన ఆమె వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేశారు. అదేవిధంగా విధులకు గైర్హాజరు అవుతున్న బోధనేతర సిబ్బంది విజయ్, మహేందర్‌కు షోకాజ్ నోటీసులు అందజేశారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అక్రమంగా మద్యం, డబ్బు తరలించినా, పంపిణీ చేసినా, కోడ్ ఉల్లంఘన జరిగినా కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, 1950, 18004254731 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా సీవిజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగాలు కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలును గుర్తించింది. ఒక్క నల్గొండ జిల్లాలోనే మొత్తం 1766 పోలింగ్ కేంద్రాలకు గానూ.. 439 పోలింగ్ కేంద్రాలను సమస్మాత్మకమైనవిగా తేల్చగా.. మరో 247 ప్రాంతాలను ఘర్షణ జరిగే ప్రాంతాలుగా గుర్తించారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన హన్మంతు ఆదివారం రాత్రి మృతి చెందారు. తండ్రి మృతిని తట్టుకోలేక మృతదేహంపై పడి పెద్ద కుమారుడు అజయ్ రాత్రంతా రోదించాడు. ఉదయం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా.. బంధువులు ధైర్యం చెప్పి పదవ తరగతి పరీక్షకు పంపారు. పుట్టెడు దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకొని పరీక్ష రాశాడు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు.

ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం. 2019లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. ఈసారి వీరి సంఖ్య 8,39,640కి పెరిగింది. పురుష ఓటర్లు 7,39,600 మంది నుంచి 7,84,043 మందికి చేరుకున్నారు. మహబూబాబాద్ స్థానంలో 2019లో 7,21,383 మంది మహిళా ఓటర్లు ఉండగా ఈసారి వీరి సంఖ్య 7,81,339కి పెరిగింది. పురుష ఓటర్లు 7,01,921 మంది నుంచి 7,45,564 మందికి చేరారు.

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. పార్టీ ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో సమావేశమయ్యారు. ZHB పరిధిలోని ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వ్యూహం, పార్టీలో చేరికలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో సురేష్ శెట్కార్, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.