India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో B.Ed, B.Ped (1వ, 3వ సెమిస్టర్) పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంట చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన బీఎడ్, బీపీఎడ్ పరీక్షలకు 1,339 మంది విద్యార్థులకు 1,302 మంది హాజరయ్యారన్నారు. 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

ఖమ్మంలో పాదచారుల భద్రత కోసం అత్యుత్తమ నాణ్యతతో ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శనివారం SR&BGNRకళాశాల పరిసరాల్లో చేపట్టనున్న గ్రానైట్ ఫుట్‌పాత్ పనుల డిజైన్లను పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు ఇబ్బంది లేకుండా స్లోప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. నగర సుందరీకరణలో భాగంగా ప్రజలకు సౌకర్యవంతమైన నడక మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార కాంగ్రెస్‌ను నిలువరించడమే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్షాలు BRS, BJP చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. చండూరు, MLG, చౌటుప్పల్ వంటి కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా కొన్నిచోట్ల రహస్య ఒప్పందాలు, మరికొన్ని చోట్ల బహిరంగ మద్దతు తెలుపుతున్నారు. ఈ వింత పొత్తులు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆదిలాబాద్ మున్సిపల్ అధ్యక్షులుగా పనిచేసి తండ్రీకొడుకులు చరిత్ర సృష్టించారు. 1962-65 మధ్య మసూద్ అహ్మద్ ఖుర్షీద్ మున్సిపల్ ప్రెసిడెంట్‌గా, 1972లో ఎమ్మెల్యేగా సేవలందించారు. సాత్నాల ప్రాజెక్ట్, సీసీఐ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన తనయుడు జావిద్ అహ్మద్ 1995లో మున్సిపల్ ఛైర్మన్‌గా విజయం సాధించి తండ్రి బాటలో నడిచారు. జిల్లా అభివృద్ధిలో వీరి సేవలు చిరస్మరణీయమని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

నిజమాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 84 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో చేపట్టిన వాహన తనిఖీల్లో 84 కేసులు నమోదు కాగా వారిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచారు.ఇందులో మొత్తం రూ. 7,90,000 జరిమానా విధించగా ఐదుగురికి వారం రోజుల జైలు శిక్షను కోర్టు విధించినట్లు వివరించారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉత్సాహంగా ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బరిలో నిలవడంతో నామినేషన్ల సంఖ్య భారీగా నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలను పరిశీలిస్తే, ఎదులాపురం మున్సిపాలిటీ 241 నామినేషన్లలో అగ్రస్థానంలో నిలిచింది.
* ఎదులాపురం 241
* వైరా 190
* మధిర 178
* కల్లూరు 159
* సత్తుపల్లి 155

జిల్లాలోని NZB కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం ముగియడంతో 146 వార్డులకు సంబంధించి 1,242 మంది బరిలో ఉన్నారు. ఇందులో BJP నుంచి 149, కాంగ్రెస్ నుంచి 584, BRS 302, MIM 148, BSP 267, AAP 9, CPM 8, TDP 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 88, స్వతంత్ర అభ్యర్ధుల నుంచి172 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. మూడు రోజుల్లో 1729 నామినేషన్లు వచ్చాయని అధికారులు నివేదిక రూపొందించారు.

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో శనివారం అధికారులు పత్రాల పరిశీలన చేపట్టారు. అసంపూర్తి సమాచారం, సాంకేతిక లోపాలు ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కాగా పాలమూరు కార్పొరేషన్‌కు 579, దేవరకద్ర 86, భూత్పూర్ 96 నామినేషన్లు రాగా, WNP జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 812, NRPT 541, GDL 525, NGKL 521 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ పుకెట్ నగర్‌కు చెందిన రామదాస్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతుల మధ్య తలెత్తిన గొడవలతో మనస్తాపం చెందిన ఆయన ఆవేశంలో గొంతు కోసుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం రామదాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

నేటి డిజిటల్ యుగంలో చిన్నారులు స్మార్ట్‌ఫోన్లకు బానిసలై ప్రాచీన సాహిత్యానికి దూరమవుతున్నారు. నైతిక విలువలు పంచిన చందమామ, బాలమిత్ర కథలు నేడు కనుమరుగవుతున్నాయి. మితిమీరిన మొబైల్ వాడకంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, పఠనాసక్తి క్షీణిస్తున్నాయని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కారవంతమైన సమాజం కోసం పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హితవు పలుకుతున్నారు.
Sorry, no posts matched your criteria.