Telangana

News September 25, 2024

ఇద్దరు గ్రామపంచాయతీ కార్యదర్శులపై సస్పెండ్ వేటు

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం సస్పెండ్ చేశారు. పెద్దవూర మండలం పులిచెర్లకు చెందిన కార్యదర్శి కే.నాగరాజు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అదేవిధంగా దామరచర్ల మండలం వాచ్యా తండాకు చెందిన జేపీఎస్ కే.స్వప్న విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

News September 25, 2024

కరీంనగర్: SU పీజీ ఫలితాలు విడుదల

image

కరీంనగర్ SU పీజీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై, ఆగస్టులో నిర్వహించిన ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎంఎస్‌డబ్ల్యూ, బాటనీ, జువాలజీ తదితర విభాగాల్లో 2, 4వ సెమిస్టర్ ఫలితాలు రిలీజ్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.శ్రీరంగప్రసాద్ తెలిపారు. https://satavahana.ac.in/ ఫలితాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.

News September 25, 2024

ADB: పోలీసుల విధులకు ఆటంకం.. 13మందికి పైగా కేసులు

image

పోలీసుల విధులకు అడ్డుపడి, పోలీస్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రోడ్డు పై వచ్చి పోయే వారికి ఇబ్బంది పెట్టిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ సీఐ కరుణాకర్ రావ్ తెలిపారు. ఇటీవల ఓ విద్యార్థి చనిపోగా కారకులపై చర్యలు తీసుకోవాలని బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉన్నా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో 13 మందితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

News September 25, 2024

కామారెడ్డిలో నూతన ఎంఈఓలు వీరే

image

కామరెడ్డి జిల్లాలోని పలు మండలాలకు నూతన ఎంఈఓలను విద్యాశాఖ మంగళవారం నియమించింది. మాచారెడ్డి-దేవేందర్ రావు, లింగంపేట్-షౌకత్, బీర్కూర్-వెంకన్న, జుక్కల్-తిరుపతయ్య, రాజంపేట్-పూర్ణ చందర్, రామారెడ్డి-ఆనందరావు, నిజాంసాగర్-తిరుపతి రెడ్డి, నాగిరెడ్డిపేట్-భాస్కర్ రెడ్డి, నస్రుల్లాబాద్-చందర్, బిబిపేట్-అశోక్, దోమకొండ-విజయ్ కుమార్, పాల్వంచ-జేతాలాల్, గాంధారి-శ్రీహరిని నియమించినట్లు ఉత్తర్వులు వచ్చాయి.

News September 25, 2024

సాఫ్ట్ బాల్ పోటీలు.. మెదక్ జిల్లా బాలుర జట్టుకు గోల్డ్ మెడల్

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మెదక్ జిల్లా బాలుర జట్టు పాల్గొన్నారు. కాగా, పోటీలో బంగారు పతకం సాధించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కొడిప్యాక నారాయణగుప్తా పేర్కొన్నారు. పోటీల్లో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన జట్టు ఫైనల్ పోటీల్లో నిజామాబాద్ జట్టుతో హోరాహోరీ తలపడి 5 – 3 స్కోర్‌తో విజయం సాధించినట్లు తెలిపారు.

News September 25, 2024

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి

image

జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మంగళవారం తెలిపారు. సివిల్, కుటుంబ తగాదాలు, క్రిమినల్ కాంపౌండబుల్, వాహన నష్టపరిహారం, చిట్ ఫండ్, ఆస్తి తగాదాలు, బ్యాంకు రికవరీ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కేసులు రాజీ చేసుకొని సత్వర న్యాయం పొందాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News September 25, 2024

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: రాహుల్ రాజ్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రతి శాఖకు సంబంధించిన ఫైలు ఈ- ఆఫీస్ ద్వారానే పరిష్కరించడం జరుగుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

News September 25, 2024

కార్టూన్ సామాన్యులను ప్రభావితం చేయగల కళ: మంత్రి జూపల్లి

image

రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్పేస్ టోన్ పేరిట కార్టూన్ నెట్ మిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మూడు అక్షరాల కార్టూన్ 30 అర్థాలను తెలియజేస్తుందని చెప్పారు. కార్టూన్ సామాన్యులను ప్రభావితం చేయగల కళ అని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్త సోమనాథ్, హరికృష్ణ, కార్టూనిస్టులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.