India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
GHMC వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోబో టెక్నాలజీతో స్ట్రాం వాటర్ డ్రైన్ క్లీనింగ్ పనులను పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. సర్కిల్ 12 మెహదీపట్నంను ఎంచుకున్నారు. వర్షపు నీటిని తరలించే డ్రైన్ పైపులలో ఉండే సిల్టును రోబోటిక్, CCTV టెక్నాలజీ సహాయంతో తొలగిస్తున్నారు. మొదట రోడ్డు క్రాసింగ్ ప్రాంతాల్లో పనులు చేపట్టారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,290 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.6,100, పచ్చి పల్లికాయకు రూ.4,700 ధర వచ్చింది. పసుపు క్వింటా రూ.12,356 ధర వస్తే.. 5531 రకం మిర్చి రూ.14 వేలు ధర పలికాయని వ్యాపారులు తెలిపారు.
జేఎన్టీయూ జర్మనీ యూనివర్సిటీల MOUకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ గడువు సాయంత్రంతో ముగియనుందని అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ వెల్లడించారు. ఐదున్నర ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి ఈ అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు. కోర్సుపై ఆసక్తి ఉన్నవారు సాయంత్రంలోగా యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ సనత్‌నగర్ నియోజకవర్గ నాయకురాలు కోట నీలిమకు 2 ఓట్లు ఉన్నాయని బీజేపీ ఐటీ వింగ్ హెడ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈమెకు ఢిల్లీతోపాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందని అమిత్ తన Xలో రాసుకొచ్చారు. ఆమె 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి 22,492 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్- 2 ఉద్యోగాలకు సంబంధించి రెండో మెరిట్ లిస్ట్‌ను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 2,116 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా వచ్చేనెల 9 నుంచి వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కార్యాయలంలో అభ్యర్థుల సర్టిఫికెట్లను సమర్పించాలని అధికారులు కోరారు. 18వ తేదీ వరకు ఈ వెరిఫికేషన్ ఉంటుందన్నారు.
సీనియర్ IPS అధికారి వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీ, వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఆయన సిబ్బందికి సందేశం పంపారు. ‘సిబ్బంది, కార్మికులు, అధికారుల సహకారం వల్లే ఆర్టీసీ ముందుకెళుతోంది. ఆదాయాన్ని రూ.9వేల కోట్లకు పెంచడంలో మీ అందరి సహకారం ఉంది. భవిష్యత్తులో నేనెక్కడ ఉన్నా నా మద్దతు ఆర్టీసీకే’ అని పేర్కొన్నారు. ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శనివారం ఉ.6 గంటలకే ప్రారంభం కానుంది. శుక్రవారం అర్ధరాత్రి దర్శనాలు ఆపేసిన తర్వాత మహాగణపతిని క్రేన్ మీదకు చేర్చే పనులు ప్రారంభమవుతాయి. రాత్రి మొత్తం వెల్డింగ్ పనులు చేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడి శోభాయాత్ర మొదలవుతుంది. మ.1.30లోపు నిమజ్జన వేడుక పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ శోభయాత్ర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. శోభయాత్ర దారి పొడవునా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 200 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. 1,300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని CP వివరించారు.
మెదక్ జిల్లాలో 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు డీఈవో ప్రొ. రాధాకిషన్ తెలిపారు. ఈనెల 6న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో జీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ ఉపాధ్యాయులున్నారని డీఈవో వివరించారు.
ప్రేమ విఫలం కావడంతో 3 రోజుల క్రితం పురుగు మందు తాగిన యువతి HYDలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21) ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. లవ్ ఫెయిల్ అయ్యి పురుగు మందు తాగగా.. గాంధీకి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.