Telangana

News January 30, 2026

నల్గొండ: హస్తం పార్టీలో ‘ఏకపక్ష’ రాజకీయం!

image

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక చిచ్చు రేపుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నిబంధనలు పక్కనపెట్టి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను సంప్రదించకుండానే అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. మంత్రి ఏకచక్రాధిపత్యంపై జిల్లా నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

News January 30, 2026

NLG: నేడే ఆఖరు తేదీ.. రెండు రోజుల్లో 607 నామినేషన్లు

image

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బుధవారం కేవలం 44 నామినేషన్లు మాత్రమే రాగా, రెండో రోజైన గురువారం ఏకంగా 563 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో రెండు రోజుల్లో మొత్తం 607 మంది అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. నామినేషన్లకు నేడే ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ ర్యాలీలతో తరలివచ్చే అవకాశం ఉంది.

News January 30, 2026

MBNR: బీఫామ్ అందించడానికి బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు

image

మహబూబ్ నగర్ నగరపాలికలోని 60 డివిజన్‌లు ఉన్నాయి. అందులో బీజేపీ 43 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇంకా పలువురుని ఖరారు చేసే ఆలోచనలో ఉందని సమాచారం. ఇందులో తమకు టికెట్ దక్కని వారు ఇలాంటి ఆవేదనకు గురి కావద్దని తమ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ జిల్లా నాయకులు చెబుతున్నారు.

News January 30, 2026

నల్గొండ: బీజేపీ జాబితాలో జాప్యం..

image

నల్గొండ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ల గడువు ముగుస్తున్నా స్పష్టత లేకపోవడంతో ఆశావహులు బీ-ఫాం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకుని టికెట్లు కేటాయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

News January 30, 2026

NLG:’ భరోసా ‘ ఇప్పట్లో లేనట్లేనా?

image

జిల్లాలో యాసంగి పంటల సాగు ప్రారంభమై 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ రైతు భరోసా అందలేదు. శాటిలైట్ సర్వే పేరిట సర్కారు జాప్యం చేస్తోంది. జిల్లాలో రైతు భరోసా కోసం సుమారు 2 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇప్పట్లో పెట్టుబడి సాయం అందే అవకాశాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 30, 2026

HYD: ఫైర్ సేఫ్టీ లేకుంటే కాల్ చేయండి: రంగనాథ్

image

ఏదైనా వాణిజ్య సముదాయం, భవనం, దుకాణం, షోరూమ్స్ ఫైర్ సేఫ్టీ లేనట్లు గమనించినా, నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించినా తక్షణం హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667, 7207923085 నంబర్లలో సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపించాలని, ‘Commissioner& HYDRAA’ హ్యాష్ ట్యాగ్‌తో Xలో ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ కోరారు.

News January 30, 2026

NZB: ధీమాతో నామినేషన్.. టికెట్ కోసం టెన్షన్ !

image

NZB జిల్లాలో రెండు రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నేతలు గెలుపు గుర్రాల వేటలో ఉండగా.. టికెట్ వస్తుందన్న ధీమాతో కొందరు, నేతల హామీతో మరికొందరు నామినేషన్లు సమర్పిస్తున్నారు. కాగా టికెట్ దక్కుతుందో లేదోనని పలువురు ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. టికెట్ దక్కని వారు పక్క పార్టీ నేతలలో సంప్రదింపులు జరుపుతున్నారు.

News January 30, 2026

NLG: జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

image

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాజకీయ సమీకరణాలకు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అసలైన పోరు అప్పుడే ప్రారంభం కానుంది. ఇటీవల ముగిసిన GP ఎన్నికల్లో తనదైన ముద్ర వేసిన అధికార కాంగ్రెస్ అదే ఉత్సాహాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా చూడాలి. మరోవైపు ప్రతిపక్ష BRS సైతం అధికార పార్టీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.

News January 30, 2026

ఖమ్మం: బాక్సింగ్‌లో ‘రూప’ మెరుపు

image

నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గురుకుల కళాశాల విద్యార్థిని వి.రూప బాక్సింగ్‌లో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఫిబ్రవరిలో కర్ణాటకలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రూప ఎంపికైంది. ప్రతిభ చాటిన రూపను ప్రిన్సిపాల్ శ్రీలత, క్రీడా విభాగం సిబ్బంది ఘనంగా అభినందించారు.

News January 30, 2026

MBNR: 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ.. నేడే లాస్ట్

image

MBNR :ఎస్సీ స్టడీ సర్కిల్ నందు 5 నెలల ఉచిత శిక్షణకు (GROUP-1,2,3&4 BANKING, SSC, RRB,) నేటితో గడువు ముగియనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో డిగ్రీ అర్హత గల SC, ST, BC, and Minority అభ్యర్థులు https://www.tsstudycircle.co.in” నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత భోజనం, వసతి, Books, నిష్ణార్థులైన అధ్యాపకులచే బోధన ఉంటుందన్నారు.