Telangana

News September 4, 2025

ఆదివారం చంద్రగ్రహణం.. బల్కంపేట ఆలయం క్లోజ్

image

ఈనెల 7న చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలను మూసివేయనున్నారు. రాత్రి 9:56 గంటలకు గ్రహణం ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 1.26 గంటలకు ముగియనుంది. గ్రహణం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేయునట్లు అధికారులు తెలిపారు. 8న ఉ.10 గంటల తరువాతే మళ్లీ భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు స్పష్టం చేశారు.

News September 4, 2025

HYD- ఆమ్‌స్టర్‌డామ్ విమాన సర్వీసులు

image

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేరుగా ఆమ్‌స్టర్‌డామ్‌ షిపోల్‌ విమానాశ్రయంతో కలిపే కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. తొలి విమానం బుధవారం బయలుదేరింది. బోయింగ్‌ 777- 200 ER విమానంతో వారానికి మూడు సర్వీసులు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి ఈ మార్గంలో సేవలు ఉన్నాయి. ఈ నిర్ణయం వ్యాపార, ప్రయాణ సౌలభ్యానికి తోడ్పడనుందని పలువురు చెబుతున్నారు.

News September 4, 2025

ఖమ్మం జిల్లాలో అక్కడే అత్యధికం.!

image

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 46.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సత్తుపల్లిలో 20.6, వేంసూరు 6.0, నేలకొండపల్లి 4.8, చింతకాని, ఖమ్మం అర్బన్ 3.6, మధిర 3.4, బోనకల్ 2.2, ముదిగొండ 1.8, వైరా మండలంలో 0.6 నమోదైనట్లు చెప్పారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

News September 4, 2025

NZB: డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసం.. కేసు నమోదు

image

సైబర్ నేరగాళ్లు NZBకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు కాజేసినట్లు NZB సైబర్ క్రైమ్ DSP వెంకటేశ్వరరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడికి వీడియో కాల్ చేసి ‘మనీలాండరింగ్ కేసుతో మీ బ్యాంకు ఖాతాకు సంబంధం ఉంది’ అని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేసినట్లు’ చెప్పి అతడి కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి రూ.30 లక్షల బదిలీ చేయించుకున్నారు. బాధితుడు 1930ను సంప్రదించగా రూ. 20 లక్షలు స్తంభింపజేశారు.

News September 4, 2025

ఖమ్మం జిల్లాకు 307 మంది నూతన జీపీఏఓలు

image

గ్రామపాలనాధికారి పరీక్షలో ఉత్తీర్ణులైన ఖమ్మం జిల్లాకు చెందిన 307 మంది అభ్యర్థులకు ఈ నెల 5న నియామక పత్రాలు అందనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ పత్రాలు అందజేస్తారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలతో గ్రామస్థాయిలో పరిపాలన మరింత పటిష్టం కానుంది.

News September 4, 2025

ఖమ్మం మార్కెట్‌కు కొత్త పత్తి రాక.!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఈ సీజన్ కు సంబంధించిన కొత్త పత్తి వచ్చింది. గురువారం మార్కెట్‌లో ఇవాళ్టి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా కొత్త పత్తి ధర రూ.6,711, క్వింటా పాత పత్తి ధర రూ.7,625, ఏసీ మిర్చి ధర రూ.15,425, నాన్ ఏసీ మిర్చి ధర రూ.8,600 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. మార్కెట్లో ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.

News September 4, 2025

HYDలో వీధికో పేపర్ బాయ్ ఉంటాడేమో!

image

HYDలో వీధికో పేపర్ బాయ్ ఉంటాడంటే అతిశయోక్తి కాదేమో. సిటీలో చదువుకునే, ఉద్యోగాలు చేసేవారికి పార్ట్ టైమ్ డ్యూటీగా ఏళ్లుగా ఎందరికో ఉపాధినిస్తోంది. నగరంలో ఉదయాన్నే మెయిన్ పేపర్లో జిల్లా ఎడిషన్ జోడిస్తూ హడావుడిగా కనిపిస్తుంటారు. వీరిలో న్యూస్ పేపర్లు చదివే ఉద్యోగాలు పొందినవారు ఉన్నారు. ఉదయాన్నే పేపర్ మనవాకిలికి చేరడంలో వీరి పాత్రే కీలకం. వారి సేవలను ప్రపంచ పేపర్ బాయ్స్ డే సందర్భంగా గుర్తుచేసుకుందాం.

News September 4, 2025

పీఆర్‌టీయూ నల్గొండ జిల్లా కమిటీ ఎన్నిక

image

పీఆర్‌టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా చిలుముల బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నల్గొండలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో సంఘం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ కవిత, ఇమామ్ కరీం తదితరులు పాల్గొన్నారు.

News September 4, 2025

NLG: వేతనం అరకొరే.. సకాలంలో చెల్లింపులు ఏవి?

image

జిల్లాలో ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులకు గత ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొంది. ఒక్కోబడిలో కంప్యూటర్ ఆపరేటర్, ఫిజికల్ డైరెక్టర్, అటెండర్, వాచ్మెన్ తదితరులను ఈ విధానంలో నియమించారు. వీరికి వేతనం అరకొరగానే అందిస్తున్నారని తెలిపారు. అయినా నెల నెల వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 4, 2025

సెప్టెంబర్ కోటా…సన్న బియ్యం పంపిణీ షురూ

image

సెప్టెంబర్ నెలకు సంబందించి సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం బియ్యం గోదాముల నుంచి రేషన్ షాపులకు చేరింది. ఈ నెల నుంచి కొత్త గా 44,099 కార్డులకు బియ్యం అందనుంది. కాగా నల్గొండలో కొందరు రేషన్ డీలర్లు రెండో తేదీన, మరికొందరు మూడో తేదీ నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.