Telangana

News April 24, 2025

హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

image

HNK ఆర్ట్స్ కాలేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల ప్రకారం.. హసన్‌పర్తి(M) కోమటిపల్లికి చెందిన అభిషేక్‌(18) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, కారులో స్నేహితులతో బయటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అభిషేక్ స్పాట్‌లోనే మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

News April 24, 2025

బల్కంపేట ఎల్లమ్మ గుడి సంపులో పడి వ్యక్తి మృతి

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్‌ పడిపోయింది. ఫోన్‌ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News April 24, 2025

HYD: కాంగ్రెస్ పరిశీలకులు వీరే

image

కాంగ్రెస్ బుధవారం పరిశీలకులను నియమించింది. HYD, మేడ్చల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఈ నియామకాలు జరిగాయి. HYDకు సురేశ్ కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్, ఖైరతాబాద్‌కు వినోద్ కుమార్, భీమగాని సౌజన్యగౌడ్, సికింద్రాబాద్‌కు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్, రంగారెడ్డికి శివసేనారెడ్డి, సంతోష్ కుమార్, దారాసింగ్, మేడ్చల్‌కు పారిజాత నర్సింహారెడ్డి, కె.శివకుమార్‌లను నియమించింది.

News April 24, 2025

HYD: కాంగ్రెస్ పరిశీలకులు వీరే

image

కాంగ్రెస్ బుధవారం పరిశీలకులను నియమించింది. HYD, మేడ్చల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఈ నియామకాలు జరిగాయి. HYDకు సురేశ్ కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్, ఖైరతాబాద్‌కు వినోద్ కుమార్, భీమగాని సౌజన్యగౌడ్, సికింద్రాబాద్‌కు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్, రంగారెడ్డికి శివసేనారెడ్డి, సంతోష్ కుమార్, దారాసింగ్, మేడ్చల్‌కు పారిజాత నర్సింహారెడ్డి, కె.శివకుమార్‌లను నియమించింది.

News April 24, 2025

నల్గొండ జిల్లాలో సుర్రుమంటున్న ‘సూరన్న’

image

నల్గొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి అనే నాణుడిని నిజం చేస్తూ రోహిణీకి ముందే సూరన్న సుర్రుమంటున్నాడు. బుధవారం కట్టంగూర్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడ్గులపల్లి 45.2, నిమనూరు 44.9, త్రిపురారం 44.8, నార్కట్‌పల్లి 44.6, అనుముల 44.6, వేములపల్లి 44.6, దామరిచర్ల 44.4, తిప్పర్తిలో కనిష్ఠంగా 44.1 డిగ్రీలు నమోదయ్యాయి.

News April 24, 2025

భగ్గుమంటున్న నిజామాబాద్.. జర జాగ్రత్త

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిన్న అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. జుక్కల్, డోంగ్లి మండలాల్లో 43.6 డిగ్రీలు, బిచ్కుంద మండలంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

News April 24, 2025

పరకాల: కొడుకుని చంపిన తండ్రి ARREST

image

కొడుకుని చంపిన తండ్రిని చిట్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. రేపాకపల్లికి చెందిన ఓదెలు పరకాల మండలం సీతారాంపురంకు చెందిన దేవిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో తండ్రి మొండయ్య కొడుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఓదెలు పెళ్లి రోజు మళ్లీ గొడవ జరిగింది. ఈ నెల 22న పడుకున్న ఓదెలుపై మొండయ్య రోకలి బండతో కొట్టి హత్య చేసి పారిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 24, 2025

కాంగ్రెస్‌ నేతల్లో గగుర్పాటు: జగదీశ్ రెడ్డి

image

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కాంగ్రెస్‌ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘ఇది బీఆర్‌ఎస్‌ సభనా, లేక టీఆర్‌ఎస్‌ సభనా అంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్‌ వస్తుండే. ఆల్‌రెడీ బీఆర్‌ఎస్‌ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు’ అని పేర్కొన్నారు.

News April 24, 2025

HYD: ఎండలు మండుతున్నాయ్.. 27 వరకు జాగ్రత్త!

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఎండ 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతను దాటేసింది. ఇబ్రహీంపట్నం, MCపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో నిన్న 40-42 డిగ్రీలవరకు నమోదైంది. 27వ తేదీ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని TGDPS తెలిపింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సా.4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని IAS అరవింద్ కుమార్ సూచించారు. గొడుగులు, టోపీలు వాడటంతో పాటు అధికంగా పానీయాలు తాగాలన్నారు.

News April 24, 2025

వనపర్తి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

image

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్‌లోని రైస్ మిల్లులో 160 కేవీ పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయాలని కాంట్రాక్టర్ సలీం సదరు ఏఈ కొండయ్యను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వనపర్తి విద్యుత్ కార్యాలయంలో కొండయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏఈని నాంపల్లి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.