Telangana

News September 24, 2024

జిల్లా కేంద్రాల్లో డీసీసీ కార్యాలయాలకు స్థలాలు కేటాయింపు !

image

డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని జిల్లాల వారీగా ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు చేయాలని డీసీసీ కమిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష, కార్యదర్శులు.. కలెక్టర్లకు దరఖాస్తులు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో త్వరలో సొంతంగా డీసీసీ కార్యాలయాలు ఉండనున్నాయి.

News September 24, 2024

పాలేరు రిజర్వాయర్‌ను సందర్శించిన మంత్రి పొంగులేటి

image

కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ కాలువను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఈరోజు సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. రైతులు ఇబ్బంది పడకుండా సాగునీరు అందించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News September 24, 2024

GDK: సింగరేణి సంస్థకు రూ.2 వేల కోట్ల లాభాలు

image

సింగరేణి సంస్థ లాభాల జోష్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక లాభాలు సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా.. రూ.2,388.50 కోట్ల లాభాలు సాధించింది. అయితే, గతంలో కన్నా ఈసారి 1 శాతం పెంచి 33 శాతం కార్మికుల వాటాగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు దసరా బోనస్ కూడా ప్రకటించడంతో గోదావరిఖని కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

News September 24, 2024

కరీంనగర్: రెండేళ్లలో 519 శిశు మరణాలు!

image

కరీంనగర్ జిల్లాలో శిశు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో రెండేళ్లలో 519 మంది శిశువులు మరణించారు. గర్భిణులు 9 నెలల పాటు పౌష్టికాహారం తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

News September 24, 2024

అలంపూర్‌లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.. డీజీపీకి ఆహ్వానం

image

రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు డీజీపీ జితేందర్‌కు ఆహ్వానం అందించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ దేవస్థానం తరఫున ఆహ్వానం అందజేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపికి తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.

News September 24, 2024

పాలమూరు జిల్లాలో తగ్గిన కూరగాయల దిగుబడి

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు కూరగాయల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వర్షాల వల్ల తోటలు దెబ్బతిని తెగుళ్లు వ్యాపించడంతో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగు తక్కువగా ఉండడంతో.. చిత్తూరు, కర్నూలు, గుంటూరు ప్రాంతాల నుంచి టమాట, పచ్చిమిర్చి ఇతర కూరగాయలు వస్తున్నాయి. మరో నెల రోజులు గడిస్తే కూరగాయల ధరలు తగ్గుముఖం పడతాయని ఉద్యాన శాఖ అధికార వేణుగోపాల్ తెలిపారు.

News September 24, 2024

MBNR ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలలో 41 కాన్పులు

image

మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో కాన్పులు చేసినట్లు సూపరింటెండెంట్ సంపత్ కుమార్ తెలిపారు. 24 గంటల్లో 41 కాన్పులు జరిగాయని పేర్కొన్నారు. 41 కాన్పులలో 10 నార్మల్, 31 సిజేరియన్ డెలివరీలు అయినట్లు వివరించారు. ప్రసవాలు నిర్వహించిన ఆసుపత్రి వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

News September 24, 2024

మూడు రోజుల్లో పంట నష్టపరిహారం: మంత్రి పొంగులేటి

image

రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు మూడు రోజుల్లో నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. BRS హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని.. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో BRS నేతల్లా తాము దోచుకోలేదని అన్నారు.

News September 24, 2024

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈరోజు మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, కార్పొరేటర్లు, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

News September 24, 2024

రేవంత్ సర్కర్ పూర్తిగా విఫలమైంది: డీకే అరుణ

image

కోస్గిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. స్థానికులతో డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. హామీల అమలులో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని, మహిళలకు రూ.2500 పెన్షన్ అందలేదని గుర్తుచేశారు.