Telangana

News March 19, 2024

ఎదురు కాల్పులు..మంచిర్యాల జిల్లా మావోలు మృతి

image

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో మెుత్తం నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

News March 19, 2024

HYD వచ్చిన యువతి.. వ్యభిచారం చేయాలని దాడి..!

image

ఉపాధి కోసం HYDకు వచ్చిన యువతితో వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాకు చెందిన యువతి టెలీకాలర్ జాబ్ కోసం ఈనెల 10న నగరంలోని MGBS బస్టాండ్‌కు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి IBPకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వంగపహాడ్‌(WGL)కు తరలించి వ్యభిచారం చేయాలని దాడి చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News March 19, 2024

HYD వచ్చిన యువతి.. వ్యభిచారం చేయాలని దాడి..!

image

ఉపాధి కోసం HYDకు వచ్చిన యువతితో వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాకు చెందిన యువతి టెలీకాలర్ జాబ్ కోసం ఈనెల 10న నగరంలోని MGBS బస్టాండ్‌కు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి IBPకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వంగపహాడ్‌(WGL)కు తరలించి వ్యభిచారం చేయాలని దాడి చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News March 19, 2024

BREAKING.. MBNR: ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ఆత్మహత్యాయత్నం

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తున్న శంకర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. శంకర్‌ను కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,280 పలకగా.. ఈరోజు రూ.7,300 పలికింది. జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 19, 2024

వాగులో పడిపోయిన డీసీఎం.. తప్పిన ప్రమాదం

image

సత్తుపల్లిలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం పట్టణ శివారులోని వంతెన పైనుంచి వెళ్తుండగా అదుపుతప్పి తమ్మిలేరు వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా వాగులో పూర్తిగా మునిగిన డీసీఎంను పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. డీసీఎం వ్యాను డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.

News March 19, 2024

HNK: వివాహం చేసుకుంటానని మోసం.. వ్యక్తి పై కేసు

image

వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి సోమవారం HNK పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు వివాహం చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేరవుతున్నానని రూ.5 లక్షలను డిజిటల్ పేమెంట్ ద్వారా తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని బెదిరిస్తుండటంతో యువతి ఫిర్యాదు మేరకు యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.

News March 19, 2024

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలు వసూళ్లకు తప్ప పాలించడానికి పనికిరారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100రోజులుగా బీఆర్ఎస్‌పై విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. CM రేవంత్ గేట్లు తెరిచినా బీఆర్ఎస్‌కు ఏమీ కాదని అభిప్రాయపడ్డారు. తాము టికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన వారినే కాంగ్రెస్‌, బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

News March 19, 2024

NGKL: ఏడుగురు విద్యార్థులపై పిచ్చికుక్కల దాడి

image

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో ఒకేరోజు ఏడుగురు విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఉదయం పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై ఒక్కసారిగా పిచ్చి కుక్కల స్వైర విహారం చేసి దాడి చేయడంతో దాదాపు 7గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈవిషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని తల్లిదండ్రులంటున్నారు.

News March 19, 2024

NLG: గృహజ్యోతి దరఖాస్తులకు బ్రేక్

image

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గృహజ్యోతి దరఖాస్తులకు బ్రేక్ పడింది. గృహజ్యోతి దరఖాస్తులు అందజేసేందుకు సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించలేదు. దీంతో రోజంతా పడిగాపులు కాసి దరఖాస్తుదారులు తిరుగు ప్రయాణమయ్యారు. కోడ్ ముగిసే వరకు దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు తెలిపారు.