Telangana

News March 23, 2024

మహబూబ్ నగర్: త్రాగునీటికి నిధులు విడుదల!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పురపాలికలకు మంచినీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.NGKL-రూ.59.79 కోట్లు,WNPT-రూ.128.29 కోట్లు,MBNR-రూ.341.25 కోట్లు, NRPT- రూ.55.57 కోట్లు,GDWL- రూ.89.46 కోట్లు మంజూరయ్యాయి.వేసవిలో భూగర్భ జలాలు ఇంకి తరచూ పట్టణాల్లో తాగు నీటి సమస్య తలెత్తుతోంది.ఈ క్రమంలో అమృత్-2లో సమస్యకు చెక్ పెడుతూ నిధులు విడుదల చేశారు.

News March 23, 2024

ADB: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లే కీలకం

image

ప్రత్యేక ఓటరు సవరణ తుది జాబితా ప్రకారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 16,43,604 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8,02,267 మంది పురుషులు, 8,41,250 మంది మహిళలు, 87 మంది ఇతరులు ఉన్నారు. ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం సిర్పూర్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ అభ్యర్థుల జయాపజయాల్లో మహిళా ఓటర్లే కీలకం.

News March 23, 2024

సిరిసిల్లలో ఇద్దరు కార్యదర్శులు సస్పెండ్

image

సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ డీపీవో వీర బుచ్చయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిళ్ల రాజు, వేములవాడ రూరల్ మండలం నెమలి గుండపల్లి పంచాయతీ కార్యదర్శి హరి ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కావట్లేదని పేర్కొన్నారు.

News March 23, 2024

సెన్సార్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ గుప్తా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా

image

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, సెన్సార్ బోర్డ్ మెంబర్ కామారెడ్డికి చెందిన రామకృష్ణ గుప్తా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని తెలిపారు. నాయకుల అంతర్గత రాజకీయాల వల్ల ఇబ్బందులకు గురై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తునట్లు వెల్లడించారు.

News March 23, 2024

MBNR, NGKL అభ్యర్థుల ఖరారు.. ఇక వ్యూహాలపై కసరత్తు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్ సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్, BJP, BRS పార్టీల ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. స్థానికంగా సమీకరణాలు శరవేగంగా మారుతున్న తరుణంలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే పలువురు నేతలు గ్రామాల వారిగా ప్రచారంలో నిమగ్నమయ్యారు.

News March 23, 2024

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామ శివారులోని మహి గ్రానైట్ పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పరిశ్రమలో విధులు ముగించుకొని వెళ్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువకుడు అమిత్ కుమార్ సింగ్(32) అనే కార్మికుడిని బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News March 23, 2024

WGL: ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై పోక్సో కేసు

image

ప్రేమ పేరుతో బాలిక(15)ను వేధించిన యువకుడి(27)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ శుక్రవారం తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈనెల 18న బాలిక ఇంటికి వెళ్లి వేధించడంతో బాలిక తల్లి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

News March 23, 2024

జగిత్యాల: నిద్రలోనే గుండెపోటుతో భక్తుడు మృతి

image

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన రటపు నరహరి(55) అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి శుక్రవారం రాత్రి స్థానిక మంగళ ఘాట్ వద్ద నిద్రిస్తుండగా, గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ధర్మపురి ఎస్సై తెలిపారు.

News March 23, 2024

హుజూర్‌నగర్‌లో రోడ్డుప్రమాదం 

image

హుజూర్‌నగర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది.  ట్రాలీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మఠంపల్లిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కొనుగంటి నర్సిరెడ్డి విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

News March 23, 2024

ఖమ్మం: ‘ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ ఇస్తాం’

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 101 వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక్క రోజే గడువు కారణంగా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాలేదని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు 15లోగానే నియామకాలు చేపట్టామని, ఇప్పటికే 38మందిని ఎంపిక చేశామని, ఎన్నికల తర్వాత మరోమారు నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలకు వైద్యులను భర్తీ చేస్తామని తెలిపారు.