Telangana

News April 24, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

image

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News April 24, 2025

కట్టంగూరు డీటీపై బదిలీ వేటు

image

కట్టంగూరు డీటీ జే.సుకన్యపై బదిలీ వేటు పడింది. అన్నారంలోని రామ్మూర్తి అనే రైతుభూమిని ఆమె వేరే వారి పేరు మీద బదిలీ చేసింది. బాధితుడు రామ్మూర్తి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. తప్పు తేలడంతో డీటీపై చర్యలు తీసుకున్నారు. సుకన్యను నల్గొండ కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు.

News April 24, 2025

NLG: రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఎంపికైన వారి వివరాలు ఈ నెల 28న ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్యను, సెల్ నంబర్ 79955 67558ను సంప్రదించాలని సూచించారు.

News April 24, 2025

MBNR: 12 వందల ఏళ్ల క్రితం నాటి శివలింగం చరిత్ర ఇదే.!

image

దాదాపు 12 వందల ఏళ్ల క్రితం కాకతీయుల రాజప్రతినిధులు గోన గన్నారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో అడ్డాకుల మండలం రాచాలలో వెలసిన దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి లింగం, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల నిర్మాణాలను పోలి ఉండటం, కందూరు గ్రామ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఉండటం ఇందుకు సాక్ష్యంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.

News April 24, 2025

తుపాకీ గురిపెట్టిన MBNR ఎమ్మెల్యే

image

ఏనుగొండలో మల్టీ స్పోర్ట్స్ ఏరియాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫిస్టల్‌ను ఎమ్మెల్యే తన చేతులతో ఎక్కుపెట్టి ఉత్సాహపరిచారు. అన్ని క్రీడలు ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. పట్టణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల స్నాతకోత్సవం

image

పట్నం మహేందర్ రెడ్డి వైద్య కళాశాల మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై మెడికల్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ మహేందర్ రెడ్డి, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి, డైరక్టర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

News April 24, 2025

ఎల్కతుర్తి సభ ఏర్పాట్లపై సీపీతో సమావేశం

image

ఈనెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్‌తో సభ ఏర్పాట్లపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చర్చించారు. సభకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకునే చర్యల గురించి రూట్ మ్యాప్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్‌తో సమావేశం అయ్యారు. 

News April 24, 2025

రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులు

image

భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గురువారం మునుగోడులో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. సర్వే సమస్యల పరిష్కారానికి 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించబోతుందని వెల్లడించారు.

News April 24, 2025

జిల్లా వ్యాప్తంగా 31 కేసులు

image

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 10 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10 మండలాలలోని 31 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రజల అవసరాలకు అధిక వడ్డీలను వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు

News April 24, 2025

పదోన్నతితో బాధ్యతలు మరింత అధికమవుతాయి: SP

image

పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందుతున్న కానిస్టేబుల్‌లకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీసు కానిస్టేబుల్‌లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. మొత్తం 28 మందికి పదోన్నతి రాగ అందులో ఆదిలాబాద్ జిల్లా వారు పదిమంది ఉండటం సంతోషకరమని ఎస్పీ అన్నారు.