India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులకు గత ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొంది. ఒక్కోబడిలో కంప్యూటర్ ఆపరేటర్, ఫిజికల్ డైరెక్టర్, అటెండర్, వాచ్మెన్ తదితరులను ఈ విధానంలో నియమించారు. వీరికి వేతనం అరకొరగానే అందిస్తున్నారని తెలిపారు. అయినా నెల నెల వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ నెలకు సంబందించి సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం బియ్యం గోదాముల నుంచి రేషన్ షాపులకు చేరింది. ఈ నెల నుంచి కొత్త గా 44,099 కార్డులకు బియ్యం అందనుంది. కాగా నల్గొండలో కొందరు రేషన్ డీలర్లు రెండో తేదీన, మరికొందరు మూడో తేదీ నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్‌పై త్రిపుర ఎమ్మెల్యే ఫిలిమ్ కుమార్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిక్‌తో పాటు నలుగురు యువకులు వచ్చి తనను, తన కుటుంబాన్ని బెదిరించారని పేర్కొన్నారు. 400 మందిని తీసుకువచ్చి గొంతుకోసి చంపేస్తామని బెదిరించారని త్రిపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ప్రతీక్, మరికొందరు పోలీసులకు లొంగిపోవడంతో బెయిల్ మంజూరైంది.
సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు గతేడాది రూ.292 కోట్లు రికవరీ చేసి అప్పగించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ఇప్పటివరకు 43,000 సిమ్‌లు, 14,000 IMEIలు, 8,000 URLలు బ్లాక్ చేశామన్నారు.
వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. గీసుకొండలో 2 మి.మీ, సంగెంలో 0.8 అత్యల్ప వర్షపాతం నమొదయింది. ఇక మిగతా 11 మండలాల్లో ఎక్కడా చినుకు రాలలేదు. కాగా, గురువారం ఉదయం నుంచి మబ్బు పట్టి వాతావరణం చల్లబడింది. వరంగల్ నగరంలో అక్కడక్కడా తుంపర్లు పడుతున్నాయి. గత నెలలో కురిసిన విస్తారమైన వర్సలకు చెరువులు పూర్తిగా నిండిపోయి జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది.
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు HYD నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ డా.విమలారెడ్డి తెలిపారు. కోర్సుల్లో చేరడానికి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
# SHARE IT
కరీంనగర్‌లో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర మార్గాలలో బందోబస్తు, రూఫ్ టాప్, పుషింగ్ పార్టీ, స్టార్టింగ్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పటిష్ట బందోబస్తుతో నిమజ్జనం విజయవంతం చేయాలన్నారు.
భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన విషాదం కనులారా వీక్షించి కాస్తయినా ఉపశమనం కలిగించేందుకు సీఎం వస్తాడని ఆశించిన అన్నదాతలు ఆవిరయ్యాయి. నేడు కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటనలో భాగంగా పోచారం ప్రాజెక్ట్ సందర్శిస్తారని ప్రచారం జరిగింది. పర్యటన షెడ్యూల్ లో లేకపోవడంతో నిరాశ చెందారు. వందలాది ఎకరాల పంట, రోడ్డు, ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తీరని నష్టం మిగిలింది. సీఎం వస్తే కొంత ఉపశమనం కలిగేదని ఆశించారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హుండీలను అధికారులు లెక్కించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. హుండీల ద్వారా రూ.86.39 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. అన్నదానానికి రూ.1,81,734 వచ్చాయన్నారు. 122 అమెరికా డాలర్లు, ఒక మలేషియా, 15 కథార్, ఒక యూరో, యూఏఈ, 65 చైనా, ఒక బెహరిన్ కరెన్సీ, మిక్స్‌డ్ బంగారం, వెండి ఆభరణాలను భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
నగరంలోని సాలార్జంగ్ మ్యూజియానికు ఈనెల 6వ తేదీన సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆరోజు గణేశ్ శోభయాత్ర, నిమజ్జనోత్సవాలలు నిర్వహించనున్న నేపథ్యంలో మ్యూజియం సందర్శన నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్‌గా సందర్శకులకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.