Telangana

News March 26, 2024

గోదావరిఖని: నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి

image

గోదావరిఖని దుర్గానగర్‌కు చెందిన లక్కీ(4) అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ అనే కూలీ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం కుటుంబంతో గోదావరిఖనికి వచ్చి స్థిరపడ్డాడు. వినోద్ కొడుకు సోమవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ముఖంపై గాయం కావడంతో సర్జరీ కోసం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. కుక్కల బెడదను తొలిగించాలని స్థానికులు కోరుతున్నారు.

News March 26, 2024

స్పోర్ట్స్ స్కూళ్లలో ఎంపికకు నేడు, రేపు పోటీలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని క్రీడాపాఠశాలల్లో విద్యార్థుల ఎంపికకు మంగళ, బుధవారాల్లో తుది పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడల అధికారి బొల్లి గోపాల్‌రావు తెలిపారు. కిన్నెరసానిలోని బాలుర, కాచనపల్లిలోని బాలికల క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 5, 6వ తేదీల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు 26, 27వ తేదీల్లో చివరి దశ పోటీలు నిర్వహించనున్నారు.

News March 26, 2024

KCR ఇలాకా గజ్వేల్‌లో నువ్వా-నేనా?  

image

మాజీ సీఎం KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తోంది. BRS అధికారంలో ఉన్న దశాబ్దకాలంగా స్తబ్దుగా ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ పీఠం కదలడంతో చోటుచేసుకున్న పరిణామాలతో వారిలో వేగంగా మార్పులు వచ్చాయి. గజ్వేల్‌ మాజీ MLA, కాంగ్రెస్ నేత తూంకుంట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌, BRS నేత ప్రతాప్‌రెడ్డి నువ్వా నేనా అన్నట్లు ఉండడంపై స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది.

News March 26, 2024

సీసీ కెమెరాల ధ్వంసం.. పదో తరగతి విద్యార్థులు ఇంటికి..

image

ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులను పాఠశాల యజమాన్యం తమ ఇళ్లకు పంపించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏడుగురు సోమవారం అర్ధరాత్రి విద్యాలయలోని సీసీ కెమెరాల ధ్వంసానికి పాల్పడ్డారు. బయటి వారు చేశారని తొలుత పోలీసులను ఆశ్రయించామని, విద్యార్థులే అని తేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు.

News March 26, 2024

సూర్యాపేట మీదుగా రైలు మార్గం

image

డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు కొత్త రైల్వే మార్గానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సర్వే జరుగుతోంది. మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లిలో సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నారు. సుమారు 296 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, చింతపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వెళ్లనుంది.

News March 26, 2024

MBNR: హీటెక్కిన ‘MLC ఉప ఎన్నిక’

image

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నువ్వా.. నేనా.. అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా ఓటర్లను క్యాంప్‌లుగా తరలించడంతో రాజకీయాలు హీటెక్కాయి. BRS సిట్టింగ్ స్థానం కావడంతో ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కాగా.. కాంగ్రెస్ సైతం పట్టు వదలకుండా పావులు కదుపుతోంది.

News March 26, 2024

హైదరాబాద్‌లోనే TB కేసులు అధికం

image

TB కేసులు గ్రేటర్‌ HYDలో పెరుగుతూనే ఉన్నాయి. 2023‌లో TGలో 73,212 మంది వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఇందులో 20 శాతం కేసులు HYDలోనే నమోదు కావడం ఆందోళనకరం. తర్వాతి స్థానంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేసులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో 15 నుంచి 44 ఏళ్ల‌ మధ్య ఉన్నవారే ఎక్కువని వెల్లడించారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు వీటి లక్షణాలు. SHARE IT

HYD నగరంలో ఏప్రిల్ నుంచి రూ.29 కిలో భారత్ రైస్..!

image

HYD నగరంలోని అత్తాపూర్ సహా పలుకాలనీల్లో కిలో భారత్ అట్టా(గోధుమపిండి) రూ.27.5, కిలో భారత్ దాల్ (శనగపప్పు) రూ.60ను మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయిస్తున్నట్లు కేంద్రీయ బండార్ సమితి తెలిపింది. కోఠిలోని భారత్ బండార్‌లో సైతం విక్రయిస్తున్నట్లు తెలిపారు. FCI నుంచి 2000 టన్నుల బియ్యం కేటాయింపులు జరిగాయని, నగరంలో ఏప్రిల్ నుంచి కిలో భారత్ రైస్ రూ.29 విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.