Telangana

News October 29, 2024

గద్వాల: ‘సర్పంచ్‌గా ఎన్నుకుంటే రూ.2,00,00,000 ఇస్తా’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక ఎన్నికల జోరు మొదలైంది. గద్వాల జిల్లా ఎర్రవల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా తనను ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2 కోట్లు ఇస్తానంటూ గ్రామానికి చెందిన పూల మద్దిలేటి పోస్టు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. జోగులాంబ పొలిటికల్ న్యూస్ అనే వాట్సాప్ గ్రూపులో వచ్చిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జీపీ ఎన్నికల నేపథ్యంలో ఈ పోస్ట్ సర్పంచ్‌ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది.

News October 29, 2024

వరంగల్: బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు

image

బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. భూపాలపల్లి జిల్లా నవాబుపేట గ్రామానికి చెందిన పూర్ణచందర్ హన్మకొండ జిల్లా మడికొండకు చెందిన ఇద్దరిని తాను డీఎస్పీని అని బెదిరించాడు. ఓ భూ పంచాయతీలో కాంప్రమైజ్ కావాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని బాధితుల ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పి.కిషన్ తెలిపారు.

News October 29, 2024

ATC కోర్సుల అడ్మిషన్లకు రేపే చివరి గడువు

image

ఖమ్మం జిల్లాలోని ఐటిఐలలో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సుల ప్రవేశాల కొరకు బుధవారం చివరి గడువు అని అదనపు కలెక్టర్ శ్రీజ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులలో చేరడానికి అడ్మిషన్ కోసం ttps://iti.telangana.gov.in ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 29, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి దామోదర్

image

అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. బోరంచలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. బీడు భూములు సస్యశ్యామలం చేస్తామని, గ్రావిటీ ద్వారా మనూరు, రేగోడ్ మండలాల్లో 3400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రధాన రహదారి వెంట 8KMకు ఒక PHC ఏర్పాటు చేస్తామని, మంజీరా బ్యాక్‌వాటర్ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

News October 29, 2024

NGKL: కులగణన పరదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని NGKL జిల్లాకలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ ముందస్తు సమావేశం నిర్వహించారు. ఇంటింటి సర్వే ప్రారంభించే దిశగా సమర్థవంతమైన ప్రణాళికల రూపొందించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తతో కులగణన సర్వేను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

News October 29, 2024

అవగాహనతో సామాజిక, ఆర్థిక సర్వే చేయండి: కలెక్టర్

image

సామాజిక, ఆర్థిక సర్వే ద్వారా వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదులు చేసేందుకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆర్థిక సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. తూఫ్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News October 29, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు లక్షెట్టిపేట గురుకుల విద్యార్థిని 

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఎస్. బ్లేస్సినా ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 29 నుంచి 30 వరకు గోదావరిఖనిలో జరగనున్న అండర్-17 రాష్ట్ర స్థాయి పోటీల్లో బ్లేస్సినా పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామ కళ్యాణి, పీఈటీ మమత తెలిపారు.

News October 29, 2024

సమగ్ర సర్వేకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ సంతోష్

image

నవంబర్ 4 నుంచి 17 వరకు జిల్లాలో చేపట్టే సమగ్ర సర్వేకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. సర్వే కొరకు ఎన్యూమరేటర్లు, ఎన్యూమరేటర్ల బ్లాకులు, హౌస్ లిస్ట్ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. మండలం వారిగా ఎంపీడీవో తహశీల్దార్, మునిసిపాలిటీలో కమిషనర్లు ఎన్యూమరేటర్లను నియమించుకోవాలన్నారు.

News October 29, 2024

తెలంగాణ SRS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్ కవి

image

తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి రచయిత బి.ప్రేమ్ లాల్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు సతీష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన రచనలు, కవితలతో సమాజంలో చైతన్యం నింపుతానని, సామాజిక కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.

News October 29, 2024

వరంగల్: గంజాయి నియంత్రణపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ సోమవారం నార్కోటిక్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో సమీక్షించి గంజాయి నియంత్రణ చర్యలు తీసుకొవాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.