Telangana

News March 26, 2024

‘ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళ్తున్నారు’

image

BRS నాయకులు పంట నష్టం పై పరిశీలనకు వెళ్లడంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. BRS పాలనలో అనావృష్టి వల్ల ఆరుసార్లు పంట నష్టపోతే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం అందించలేదని విమర్శించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళుతున్నారన్నారు. పంట నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

News March 26, 2024

కమ్మర్‌పల్లి: లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

image

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్ పనులు పూర్తి చేయడానికి రూ.8 వేలు లంచంగా తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ హరిబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదు చేసి కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.

News March 26, 2024

మెదక్: షాంపూ కోసం తల్లిని చంపాడు

image

షాంపూ కోసం కన్నతల్లిని ఇటుకతో కొట్టి హత్య చేసిన సంఘటన మెదక్ మండలం రాజ్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవమ్మ(58)తో తన కుమరుడు నారాయణ షాంపూ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో తల్లిని ఇటుకతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2024

నల్గొండ జిల్లాకు KCR

image

మాజీ సీఎం కేసీఆర్ త్వరలో నల్గొండకు రానున్నారు. నీళ్లు లేక ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంబంధిత నివేదికను KCRకు అందించారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.

News March 26, 2024

గోవా క్యాంపు నుంచి ప్రజా ప్రతినిధుల తిరుగుముఖం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోవాకు తరలిన వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈరోజు తిరుగు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. వారికి హైదరాబాదుకు తరలిస్తారని సమాచారం. మార్చి 28న ఓటింగ్ సమయానికి వనపర్తికు తెచ్చే అవకాశం ఉంది. ఓటర్లను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసిన సంగతి విధితమే.

News March 26, 2024

నా బాస్‌ KCR ఒక్కరే: పద్మారావు

image

సికింద్రాబాద్‌లో గెలవబోతున్నామని BRS MP అభ్యర్థి పద్మారావు జోస్యం చెప్పారు. తెలంగాణభవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో‌ ఆయన మాట్లాడారు. ‘అప్పట్లో నా వద్ద బండి లేదు. కార్పొరేటర్‌ నుంచి పార్లమెంట్‌ స్థాయికి ఎదిగాను. నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. నా బాస్ KCR ఒక్కరే. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ MP ఎన్నికల్లోనూ గెలుస్తాను’ అంటూ పద్మారావు ధీమా వ్యక్తం చేశారు.

News March 26, 2024

నా బాస్‌ KCR ఒక్కరే: పద్మారావు

image

సికింద్రాబాద్‌లో గెలవబోతున్నామని BRS MP అభ్యర్థి పద్మారావు జోస్యం చెప్పారు. తెలంగాణభవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో‌ ఆయన మాట్లాడారు. ‘అప్పట్లో నా వద్ద బండి లేదు. కార్పొరేటర్‌ నుంచి పార్లమెంట్‌ స్థాయికి ఎదిగాను. నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. నా బాస్ KCR ఒక్కరే. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఈ MP ఎన్నికల్లోనూ గెలుస్తాను’ అంటూ పద్మారావు ధీమా వ్యక్తం చేశారు.

News March 26, 2024

KTDM: స్నేహితుడిపై గొడ్డలితో దాడి

image

అశ్వరావుపేట మండలం నందమూరి కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ నెలకొంది. రంజాన్, చిన్నా అనే ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చెలరేగి రంజాన్ గొడ్డలి తీసుకువచ్చి చిన్నాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న స్థానికులు  గాయపడ్డారు. చిన్నాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News March 26, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్..ఇద్దరికీ జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తులకు NZB ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. NZB పట్టణ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 12 మంది పట్టుబడ్డారు. వారిని మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 10 మందికి రూ. 11300 జరిమానాలు మరో ఇద్దరికి 2 రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ ACP నారాయణ తెలిపారు.

News March 26, 2024

RDM: లైసెన్సులు ఉన్న తుపాకులు సరెండర్ చేయాలి: CP

image

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్సు తుపాకులు కలిగిన వారు వెంటనే ఆయా స్టేషన్‌లలో సరెండర్ చేయాలని CPశ్రీనివాస్ (IPS) ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 7న తిరిగి తీసుకోవచ్చున్నారు . జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనలు పాటించాలన్నారు.