India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా దామల్ల సుజాతను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన తస్లీమా మహ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా సుజాత విధుల్లోకి రానున్నారు.

వేసవి వచ్చిందంటే చాలు విద్యార్థులు వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నారు. ఈత నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్నవారు ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
* ఈత నేర్చుకునే వారు సహాయకులు లేకుండా వెళ్ళవద్దు
* బావుల్లో, కొలనులో నీటి లోతును గుర్తించి దిగడం మంచిది
* ఈత నేర్చుకుంటున్న పిల్లలు నడుముకు బెండ్లు, ట్యూబ్లు, తాళ్లు వంటివి కట్టుకోవాలి.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైయిరీ, ఐడీ, హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం HYD ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుందన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా తనను ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని HYDలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు ఎంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

మల్కాజిగిరిలో BRS గెలుపు ఖాయమని ఉప్పల్ MLA బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి.. మల్కాజిగిరిని KCRకు గిఫ్ట్‌గా ఇద్దామని అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించేలా లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

చర్ల సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో తుపాకుల మోత మోగింది. పెడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి జవాన్లు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు గాలిస్తున్నారు.

బాలికపై లైంగిక దాడికి యత్నించి పోక్సో కేసులో అరెస్టయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ బండారి సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలికపై అత్యాచారానికి యత్నించినందుకు సంపత్‌పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.