India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాక) మనవడు వంశీకృష్ణ. వంశీకి భార్య రోష్ని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన 2010లో అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ పట్టా పొందారు. కాకా కుటుంబంలోని 3వ తరానికి చెందిన వంశీకృష్ణ విశాఖ ట్రస్టు ద్వారా పలు సేవలు చేస్తున్నారు. తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా, పెదనాన్న వినోద్ బెల్లంపల్లి ఎఎమ్మెల్యేగా ఉండగా కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీ బరిలో నిలిచారు.

HYD, RRలో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజిగిరి నుంచి వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల అధికార పార్టీలోకి చేరగా వీరికే అధిష్ఠానం MP టికెట్లు ఇచ్చింది. వీరిలో గెలిచేది ఎవరు.. మీ కామెంట్..?

HYD, RRలో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజిగిరి నుంచి వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల అధికార పార్టీలోకి చేరగా వీరికే అధిష్ఠానం MP టికెట్లు ఇచ్చింది. వీరిలో గెలిచేది ఎవరు.. మీ కామెంట్..?

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎస్సీ అభ్యర్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించే డీఎస్సీ ఉచిత శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 8465035932 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన రఘునాథపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కార్తీక్ (28) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పనులు దొరకకపోవడంతో కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పెద్దపల్లి MP అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణ పేరును ఖరారు చేసింది. 2010లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మేనేజ్‌మెంట్ డిగ్రీ USAలో పూర్తి చేశాడు. 2011లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో శిక్షణ తీసుకుని, 2012లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. వీ6 ఛానల్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.

రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ శివారులోని గంజి వాగు దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోసానిపేటకు చెందిన బలగం రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయ. ఆయనను కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.

గిరిజన గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు నిర్దేశిత వెబ్ సైడ్ http:///tgtwgu-rukulam.telangana.gov.in ద్వారా ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నూతన ఛైర్ పర్సన్‌గా మామిండ్ల జ్యోతికృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఛైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించారు. గత ఛైర్మన్(BRS)పై అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇందులో గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి కీలకంగా వ్యవహరించారు.
Sorry, no posts matched your criteria.