Telangana

News September 24, 2024

ఉప రాష్ట్రపతిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్

image

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న అర్వింద్ సోమవారం ఆయన్ను కలిసి పలు అంశాలపై చర్చించారు.

News September 24, 2024

‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

ఈనెల 28న మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి లక్ష్మీ శారద పేర్కొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ రోజున మెదక్, నర్సాపూర్ కోర్టు నందు నిర్వహించబడును అని ఈ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించుకునే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ సదావకాశాన్ని ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 24, 2024

RR: జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం

image

RR జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త, కంటి, దంత, చర్మ, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందు అందజేశారు. జిల్లా ప్రధాన జడ్జి శ్రీధర్ రెడ్డి NGOలను అభినందించారు. DLSA కార్యదర్శి శ్రీదేవి, జడ్జిలు పట్టాభిరామారావు, ADJలు పద్మావతి, ఆంజనేయులు, BAR కౌన్సిల్ PRSDT కొండల్ రెడ్డి, గోపీశంకర్ యాదవ్ ఉన్నారు.

News September 24, 2024

ఆసిఫాబాద్‌లో సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ పురుషులు, మహిళల హ్యాండ్ బాల్ పోటీలను ఈ నెల25న ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9గంటలకు హ్యాండ్ బాల్ కోచ్ అరవింద్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.

News September 24, 2024

పోలీస్ గ్రీవెన్స్ డేకు 57 దరఖాస్తులు: ఎస్పీ

image

NLG: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 57మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

News September 24, 2024

‘స్వచ్చతా-హీ-సేవా’ కార్య‌క్ర‌మాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

image

‘స్వచ్చతా-హీ-సేవా’ కార్య‌క్ర‌మాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో రివ్యూ అనంతరం మంత్రి మాట్లాడుతూ… అధికారులంతా జ‌వాబుదారిగా వ్య‌వ‌హ‌రించాలని కోరారు. జిల్లాల్లో ప్ర‌తి రోజు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను అన్ లైన్ లో ఎంట్రీ చేయాల‌ని సీతక్క సూచించారు.

News September 24, 2024

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు

image

ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామసమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.98 టీఎంసీలు ఉన్నాయన్నారు. మిడ్‌మానేరు ద్వారా వచ్చిన 3,200 క్యూసెక్కుల నీటిని ఒక పంపు ద్వారా ఎత్తిపోస్తుండగా, ఎగువన ఉన్న రంగనాయకసాగర్‌కు 3,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

News September 24, 2024

తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు: మంత్రి తుమ్మల

image

ఖమ్మం నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యలను ఆదేశించారు. సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం, తదితర సమస్యలపై పలు సూచనలు చేశారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల మోటర్లు కాలిపోవడంతో త్రాగునీటి సమస్య అధికారులు మంత్రికి వివరించారు.

News September 24, 2024

NRPT: BC విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మా జ్యోతిబాపులే విద్యానిధి పథకం- 2024 కింద BC,EBC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖాలీల్ తెలిపారు. అక్టోబరు 15వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, హ్యూమాని టీస్, సోషల్ సైన్స్ లో 60% మార్కులు పొందినవారు అర్హులన్నారు. వయసు 35,వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదన్నారు.

News September 24, 2024

NZB: ఇంట్లో చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి

image

నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్‌లో గల సీఎం రోడ్ గల్లీ మదర్సా ప్రాంతంలోని వాజిద్ ఖాన్ ఇంట్లో నసీర్ అనే యువకుడు సోమవారం పట్టపగలు చోరీకి యత్నించాడు. అదే సమయంలో యజమాని పిల్లలతో సహా తిరిగి వచ్చారు. వారిని చూసిన దొంగ కత్తితో బెదిరించి పారిపోయేందుకు యత్నించాడు. కాగా అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.