India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలోని ICMR, JNTU ఆచార్యులు వైద్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించారు. రాజధాని సహా శివారు ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త, మూత్ర నమూనాలను డ్రోన్స్ ద్వారా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఒక్కోటి 60-75 KM దూరాన్ని చేరుకునేలా సాఫ్ట్‌వేర్ రూపొందించామని, ముగ్గురు డ్రోన్ పైలెట్లు వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాధార మందులను సైతం పంపిస్తున్నట్లు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో డబ్బు, మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలను డీఎస్పీ తిరుపతి రావు బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డబ్బు సరఫరా అవ్వకుండా ఉండేందుకు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక వెలువడిన నేపథ్యంలో NZB సీపీ కల్మేశ్వర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ARMS లైసెన్స్ పొంది ఉన్న వారు ఆయుధాలను సంభందిత పోలీస్ స్టేషన్‌లలో ఈ నెల 23 లోపు జమ చేయాలన్నారు. మినాహాయింపు పొందాలనుకుంటే ARMS జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో వారి పేర్లను ముందే చూసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన కోరారు. బుధవారం ఆమె నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో ఏర్పాటు చేయనున్న పార్లమెంటు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం సైతం ఎక్కడుందో చూసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపిడివో, ఎంపీవో, ఆర్ డబ్ల్యుఎస్ ఇంజినీర్లతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

@ ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ చెక్ పోస్ట్ వద్ద 2,53,000 నగదు సీజ్. @ కరీంనగర్ రూరల్ స్టేషన్ ఏఎస్సై కిషన్ గుండెపోటుతో మృతి. @ ఓదెల మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి. @ పెద్దపల్లి మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడి మృతి. @ కమలాపూర్ మండలంలో రైలు నుండి పడి యువకుడికి గాయాలు. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య.

BRS పార్టీ నేత, TSMDC మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు చేసినట్లుగా HYD మాదాపూర్ పోలీసులు తెలిపారు. Xలో ఫేక్ పోస్ట్ పెట్టినందుకుగాను సీఆర్పీసీ అండర్ సెక్షన్ 41(a) కింద బుధవారం నోటీసులు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు క్రిశాంక్ మొబైల్ సైతం సీజ్ చేసి, దర్యాప్తును వేగవంతం చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

BRS పార్టీ నేత, TSMDC మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు చేసినట్లుగా HYD మాదాపూర్ పోలీసులు తెలిపారు. Xలో ఫేక్ పోస్ట్ పెట్టినందుకుగాను సీఆర్పీసీ అండర్ సెక్షన్ 41(a) కింద బుధవారం నోటీసులు అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు క్రిశాంక్ మొబైల్ సైతం సీజ్ చేసి, దర్యాప్తును వేగవంతం చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడితే సహించబోమని పోలీసులు హెచ్చరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జడ్జి ఖదీర్ బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 9 మంది పట్టుబడగా అందులో పఠాన్ షేర్ ఖాన్, సిర్నాపల్లి భూమేశ్, పెందోట రవి కుమార్‌లకు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ వచ్చిన పాలమూరులో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పార్లమెంటరీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు మహబూబ్నగర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. డీకే అరుణ తరఫున ప్రచారానికి నరేంద్ర మోడీ వచ్చినా గెలుపు మాత్రం కాంగ్రెస్ దే అని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆమె ఓటమి తప్పదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.