Telangana

News April 18, 2025

గుడ్‌న్యూస్: అమర్నాథ్ యాత్రకు గాంధీలో సర్టిఫికెట్లు

image

అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉ.10:30 గంటలకు ప్రధాన భవనం, మెడికల్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ సర్టిఫికెట్ పొందవచ్చు. దరఖాస్తుతో పాటు రక్త పరీక్షలు, ఛాతి ఎక్స్‌రే, బ్లడ్ గ్రూపు పరీక్షల రిపోర్ట్‌లను తీసుకురావాలని తెలిపారు.

News April 18, 2025

ధరణి పోర్టల్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. మీ కామెంట్..?

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న భూభారతి కార్యక్రమంతో భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలో గురువారం భూభారతి పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మూలంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. దీనిపై మీ కామెంట్?

News April 18, 2025

HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

image

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.

News April 18, 2025

పాలమూరులో నేటి ముఖ్యంశాలు!

image

✔ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్:NGKL డీఈవో✔కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ ✔పరిశ్రమలపై నాగర్‌కర్నూల్ ఎంపీ చర్చ ✔BJPకి కాంగ్రెస్ భయం పట్టుకుంది:చిన్నారెడ్డి✔బీసీ చైతన్య సభ పోస్టర్ ఆవిష్కరణ✔పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి:TUCI✔NRPT: Way2News కథనానికి స్పందన.. ‘మొసలిని బంధించారు’✔‘పీయూ RTF కోర్స్ ఫీజులు విడుదల చేయాలి: విద్యార్థులు

News April 17, 2025

సిజేరియన్ డెలివరీలపై చర్యలు తీసుకోవాలి: మంత్రి

image

కోఠిలోని TGMSIDC కార్యాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. సరైన కారణాలు లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని, నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవిలో గర్భిణులు, బాలింతల కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

News April 17, 2025

WGL: మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పలు సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు రూ. 26 వేలు పలకగా.. దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలికింది. అలాగే 5531 మిర్చికి కూడా నేడు రూ.9,300 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి ఉన్న డిమాండ్‌ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.

News April 17, 2025

ADB: పాఠ్యపుస్తకాల గోదాంను తనిఖీ DEO

image

ఆదిలాబాద్ జిల్లాకేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను నిల్వ ఉంచిన గోదాంను DEO శ్రీనివాస్‌రెడ్డి గురువారం తనిఖీ చేశారు. జిల్లాకు ఎన్ని పుస్తకాలు కావాలి.. మనకు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయో.. పాఠ్య పుస్తకాల మేనేజర్ సత్యనారాయణను అడిగి తెలుసుకొని ఆరా తీశారు. గోదాంలో నిల్వ ఉంచిన పుస్తకాల కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. డీఈఓ వెంట సీసీ రాజేశ్వర్ ఉన్నారు.

News April 17, 2025

NZB: జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్

image

జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయ ఛాంబర్‌లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూల బొకేతో జ్ఞాపికను బహూకరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు.

News April 17, 2025

BREAKING: ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్: నాగర్‌కర్నూల్ డీఈవో

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు కళ్యాణిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.

News April 17, 2025

ఖమ్మం: ఇద్దరు పిల్లలను నరికి తల్లి SUICIDE

image

హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

error: Content is protected !!