Telangana

News April 17, 2025

BREAKING: ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్: నాగర్‌కర్నూల్ డీఈవో

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు కళ్యాణిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.

News April 17, 2025

ఖమ్మం: ఇద్దరు పిల్లలను నరికి తల్లి SUICIDE

image

హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

News April 17, 2025

OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News April 17, 2025

21 నుంచి MBA ఇంటర్నల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలో MBA ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదిన నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ తెలిపారు. MBA నాలుగో సెమిస్టర్ రెండో ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు.

News April 17, 2025

బషీర్‌బాగ్‌: ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్

image

బషీర్‌బాగ్‌లోని SCERT కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్ జరిగింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.శాంత సిన్హా, ప్రొ.రామ మేల్కొటి, ప్రొ.కోదండరాం తదితరులు పాల్గొని వ్యాసాలు సమర్పించారు.

News April 17, 2025

సిటీలో పెరుగుతున్న నీటి వినియోగం

image

HYD మహానగరంలో నీటి వినియోగం ఏటా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ నగరం విస్తరిస్తుండటం కూడా ఓ కారణం. 2021 మార్చిలో జలమండలి 75,782 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయగా, 2022 మార్చికి 83,078 ట్యాంకర్లకు పెరిగింది. 2023 మార్చిలో 1,12,679 ట్యాంకర్ల నీటిని సిటీ ప్రజలు ఉపయోగించగా 2024 మార్చి నాటికి ఆ సంఖ్య 1,69,596కు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 2,82,961 ట్యాంకర్ల సరఫరా జరిగింది.

News April 17, 2025

నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.

News April 17, 2025

MBNR: కార్మిక చట్టాలు నిర్వీర్యం: సీఐటీయూ 

image

మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి ఏప్రిల్ 22న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శి కురుమూర్తి తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, అధిక ధరలు తగ్గించి, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.

News April 17, 2025

భూత్పూరు: సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఆకస్మిక తనిఖీలు

image

జిల్లా ఎస్పీ డీ.జానకి ఆదేశాల మేరకు భూత్పూర్ మండల పరిధిలోని సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ యశ్వంత్ రావు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నిబంధనలకు విరుద్ధంగా సీడ్ ప్రాసెసింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విత్తన శుద్ధి, ప్యాకింగ్ ,గోదాముల నిర్వహణ వంటి అంశాల్లో పూర్తి సమీక్ష జరిపామని తెలిపారు.

News April 17, 2025

MBNR: బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు: సీనియర్ సివిల్ జడ్జి

image

నేరం జరుగుతున్నప్పుడు చూసి తనకెందుకులే అని సాక్ష్యం చెప్పకపోయినా నేరస్థులే అవుతారని జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. చిన్నచింతకుంట ఎంపీడీవో ఆవరణలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, బాల కార్మిక చట్ట నివారణ, బాలల సంరక్షణపై నిర్లక్ష్యాన్ని విడనాడాలని సూచించారు. నేరాల అదుపునకు చట్టాలతో పాటు బాధ్యతలు కూడా అంతే ముఖ్యమన్నారు.

error: Content is protected !!