Telangana

News April 17, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు..!

image

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 190 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 164 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.6,639, కనిష్ఠ ధర రూ.5,241 లభించింది. మొక్కజొన్న 2,474 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,251, కనిష్ఠ ధర రూ.2259, కనిష్ఠ ధర రూ.1,681 లభించింది. వడ్లు ఆర్ఎన్ఆర్ 2004 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ.2,306 లభించింది.

News April 17, 2025

MBNR: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుదాం: ఫైర్ స్టేషన్ ఆఫీసర్

image

వేసవికాలంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని మహబూబ్‌నగర్ అగ్నిమాపక శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గృహాలు, హాస్పిటల్స్, పాఠశాలలు, కర్మాగారాల్లో ప్రమాదాలు, వరదలు, రోడ్డు, రైలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ నంబర్ 101కు సమాచారం అందించాలన్నారు.

News April 17, 2025

రోగికి ఆధార్ తప్పనిసరి : ఆదిలాబాద్ DMHO

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తప్పకుండా ఆధార్ కార్డును తీసుకొని వెళ్లాలని ఆదిలాబాద్ DMHO డా.నరేందర్ రాథోడ్ సూచించారు. తద్వారా వ్యాధిగ్రస్థుల సమాచారం అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తామన్నారు. భవిష్యత్తులో రోగికి అందించిన సేవల వివరాలు తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటుందన్నారు. దీని ద్వారా చికిత్సలు అందించడానికి సులువవుతుందన్నారు. ఆరోగ్య, ప్రాథమిక కేంద్రాలకు ఆధార్ తీసుకు వెళ్లాలన్నారు.

News April 17, 2025

నాగర్‌కర్నూల్: తల్లిదండ్రులు మృతి.. అనాథలుగా పిల్లలు..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి గుండాల కుమార్ మృతిచెందగా, అప్పటి నుంచి కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్న తల్లి దేవి ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందింది. అనాథలుగా మారిన ఆ పిల్లలు ‘అమ్మానాన్న’ కావాలంటూ విలపిస్తున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News April 17, 2025

సమ్మర్ టూర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను చుట్టేద్దాం..

image

సమ్మర్ HOLIDAYS వచ్చాయంటే ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తుంటారు. మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చాలా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం ఫోర్ట్, పాపికొండలు, పులిగుండాల, లకారం ట్యాంక్‌బండ్, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రం, భద్రాచలం రామయ్య గుడి, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్ట్, పాల్వంచ పెద్దమ్మ గుడిని ఒక్క రోజులో చుట్టేయొచ్చు. వీటిలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో కామెంట్ చేయండి

News April 17, 2025

ADB: భానుడి ప్రతాపంతో విలవిల్లాడుతున్న జనం

image

భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ మధ్యాహ్నం 12 గంటలకు నిర్మానుష్యంగా మారాయి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు రోజుల నుంచి 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News April 17, 2025

గన్నేరువరంలో భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన

image

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో గురువారం భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ హాజరై మాట్లాడారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కల్పించారు. భూభారతిపై ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News April 17, 2025

కరీంనగర్: డిజిటల్ తరగతులను ప్రారంభించిన కలెక్టర్

image

కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. డిజిటల్ విద్యా బోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన కలుగుతుందన్నారు. ఉపాధ్యాయులు మెలకువలతో పాఠాలను బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అధికంగా వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

News April 17, 2025

ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉంది: షబ్బీర్ అలీ

image

ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. వక్ఫ్‌ (సవరణ)చట్టం-2025 చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభించిందన్నారు.

News April 17, 2025

WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,500 పలికింది. అలాగే పసుపు(కాడి) క్వింటాకి ధర రూ.14,117 వచ్చింది. మరోవైపు మక్కలు(బిల్టీ) క్వింటా ధర రూ.2,365 పలికినట్లు అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!