Telangana

News April 23, 2025

ఖమ్మం: 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

News April 23, 2025

నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

image

తిప్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రవి అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నర్సింగ్ బట్లకి చెందిన రవి (30) పెళ్లి మండపం కట్టడానికి మంగళవారం రాత్రి మిర్యాలగూడ వెళ్లాడు. ఈ తెల్లవారుజామున బైక్‌పై తిరిగి వస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి కిందపడ్డాడు. అతని పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ఆస్పత్రికి తరలించారు. 

News April 23, 2025

ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News April 23, 2025

భానుడి ఉగ్రరూపం.. ఆ మండలాల్లోనే అత్యధికం

image

ఖమ్మం జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తుంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5, బోనకల్, చింతకాని 41.4, కల్లూరు 39.8, సత్తుపల్లి 39.3 నమోదైంది.

News April 23, 2025

మెదక్: ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ పరీక్షా ఫలితాల్లో రేగోడ్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి వెన్నెల ప్రణీత్ కుమార్ 470 మార్కులకు గాను 467 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించాడు. ప్రణీత్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్లే మంచి మార్కులు సాధించానని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి విద్యలో ఉత్తమ ప్రతిభ పాటవాలు కనబరుస్తున్నాడు.

News April 23, 2025

HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్

image

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ ల‌భించింది. TMRJC ఖైర‌తాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కుల‌కు గాను 495 మార్కులు వ‌చ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 23, 2025

239 వాహనాలను తీసుకెళ్లండి: మెదక్ ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు కేసులు, తనిఖీల్లో పట్టుబడిన 239 వాహనాల(టూ వీలర్స్ 224, ఆటోలు 9, ఫోర్ వీలర్స్ 6)ను జిల్లా పోలీసు కార్యలయం వద్ద భద్రపరిచారు. వాహనాల యజమానులు ఎవరైనా గుర్తుపట్టి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకువచ్చి అధికారులకు చూపించి తీసుకెళ్లాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు.

News April 23, 2025

గద్వాల: ఇంటర్ FAIL అవుతానేమోనని చనిపోయాడు.. కానీ పాసయ్యాడు!

image

ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా మల్దకల్(M) మల్లెందొడ్డికి చెందిన వినోద్(18) గద్వాల GOVT జూనియర్ కాలేజీలో ఇంటర్ 1st YEAR చదువుతున్నాడు. తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయంతో ఇటీవల పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. అయితే మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News April 23, 2025

NLG. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కవలలు

image

ఇంటర్ ఫలితాలలో నల్గొండకు చెందిన విద్యార్థినులు( కవలలు) దుర్గాంజలి, అఖిల సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 466/470, 461/470 మార్కులు సాధించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అత్యధిక మార్కులు సాధించినందుకు ఆనందంగా ఉందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు సహకరించిన తల్లిదండ్రుల, గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.

News April 23, 2025

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.