Telangana

News September 3, 2025

నాంపల్లి: ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గౌరిపుత్రుడి నిమజ్జనం

image

బజార్‌ఘాట్‌లోని బంగారు ముత్యాలమ్మ ఆలయం ముందు ఏర్పాటు చేసిన 18 అడుగుల గణేశుడు తళుక్కున మెరిసిపోతున్నాడు. ఈ లంబోదరుడిని ప్రత్యేకంగా స్టోన్స్(వజ్రాల)తో అలంకరించారు. 50 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న ఈ గణనాథుడిని ఈసారి మొయినాబాద్‌లో తయారు చేయించారు. చవితి రోజున ప్రారంభమైన అన్నదానం శనివారం వరకు సాగనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అదేరోజు ఈ గౌరిపుత్రుడిని నిమజ్జనం చేయనున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు.

News September 3, 2025

HYD: హ్యాపీ దీపావళి పింకీస్: రామ్మోహన్ రెడ్డి

image

BRS ముఖ్యనేతలు హరీశ్ రావు, సంతోశ్‌రావులపై కవిత తీవ్ర విమర్శలు చేయడంపై TPCC అధికారిక ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి X వేదికగా స్పందించారు. ‘KCRకు వెన్నుపోటు పొడుస్తుంది.. హరీశ్, సంతోష్ రావులేనని కవిత చెప్పింది. వీరిద్దరు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని భవిష్యత్తులో ఎపిసోడ్‌లుగా కవితక్క బయటపెట్టనున్నారు. ఇకపై కవితక్క పేలుస్తుంది చూడండి లక్ష్మీ బాంబులు. హ్యాపీ దీపావళి పింకీస్’ అని ట్వీట్ చేశారు.

News September 3, 2025

HYD: ఈ ATMతో క్షణాల్లో రక్త, వైద్య పరీక్షలు

image

60 రకాల వైద్యపరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చే ATMను ఢిల్లీకి చెందిన క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అంకుర సంస్థ రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టుగా కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ATMలను ఏర్పాటు చేసింది. ఈ ATMలో అనేక రోగ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని, ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోగులకు ATMపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇది సక్సెస్ అయితే మరిన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.

News September 3, 2025

మాదాపూర్, గచ్చిబౌలిలో ఆకాశాన్ని అంటిన మి‘అద్దె’లు

image

ఐటీ హబ్‌గా మారడంతో మాదాపూర్, గచ్చిబౌలిలో నివాస గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు గ్రామంగా ఉన్న మాదాపూర్, ఇప్పుడు భారీ గ్లాస్ టవర్లు, అపార్ట్‌మెంట్లతో నిండిపోయింది. నాలుగేళ్ల క్రితం రూ.23 వేలు ఉన్న 2BHK ఫ్లాట్ అద్దె ఇప్పుడు రూ.35 వేలకు చేరింది. గేటెడ్ కమ్యూనిటీలోని 3BHK అద్దె రూ.50 వేలకు పెరిగింది. ఐటీ కంపెనీల విస్తరణే ఈ అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణమని రియల్టర్‌ల అంచనా.

News September 3, 2025

NZB: నగర పాలక సంస్థలో ACB దాడులు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థలో బుధవారం ACB అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ పండ్ల దుకాణానికి అనుమతి కోసం రూ.7 వేలు లంచం డిమాండ్ చేసిన RI శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ జవాన్ ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 3, 2025

రాబోయే 3 గంటల్లో HYDలో వర్షం!

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రాబోయే 3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రజలకు అలర్ట్‌లు పంపించింది. 30- 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News September 3, 2025

జాతీయస్థాయి పోటీలకు NZB క్రీడాకారులు

image

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లాకి చెందిన ఇద్దరు క్రీడాకారులు నేహాల్ అఫ్సర్, ఐశ్వర్య ఎంపికయ్యారని జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బిలి నరేష్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు లూథియానా(పంజాబ్)లో ఈనెల 2 నుంచి నుంచి 9 వరకు జరిగే 75వ జూనియర్ నేషనల్స్‌లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

News September 3, 2025

కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు: తుమ్మల

image

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, ఆ ప్రభావం తెలంగాణ పైనా పడిందని చెప్పారు. గత నెల తెలంగాణకు రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని, యూరియా పంపాలని పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు.

News September 3, 2025

మున్నేరు నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన సీపీ

image

గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో నగరంలోని కాల్వోడ్డు, మున్నేరు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ నీరజ, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనతో కలిసి ఈ పరిశీలనలో పాల్గొన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News September 3, 2025

APK ఫైల్స్‌తో జర జాగ్రత్త: ఆదిలాబాద్ SP

image

APK ఫైల్స్ పట్ల అప్రమత్తత తప్పనిసరి అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీఏ ఈ చలాన్ పేరుతో వాట్సాప్‌లో ఫేక్ అప్లికేషన్ చక్కర్లు కొడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్‌లు ఇలాంటి వాటిని వెంటనే తీసివేయాలన్నారు. నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం ఉందన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930ను సంప్రదించాలని సూచించారు.