Telangana

News October 22, 2025

ఖమ్మం DCC పీఠం కమ్మ సామాజిక వర్గానికేనా..?

image

ఖమ్మం DCC అధ్యక్ష పీఠం కోసం అంతర్గత రాజకీయం రగులుతుంది. Dy.CM భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. భట్టి వర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నూతి సత్యనారాయణ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. భట్టి వ్యూహాత్మకంగా కమ్మ వర్గం అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు సమాచారం. స్థానికత, సామాజిక సమీకరణలపై ఆధారపడి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.

News October 22, 2025

NLG: మద్యం దుకాణాలకు 4,629 దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు మంగళవారం మరో 9 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,629 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

News October 22, 2025

ఖమ్మం: 200 ఉద్యోగాలు.. రేపే అవకాశం

image

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జె.వి.జి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఏరో స్పేస్, ఎలివేటర్స్ తయారీ యూనిట్లలో దాదాపు 200 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అర్హత గల 19-23 ఏళ్ల యువతీ యువకులు హాజరుకావాలని సూచించారు.

News October 22, 2025

సర్వేలో పాలుపంచుకోండి: కలెక్టర్‌ అనుదీప్‌

image

రాష్ట్ర భవిష్యత్‌ రూపకల్పనకై ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్‌–2047’ సిటిజన్‌ సర్వేలో ప్రతి పౌరుడు పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి పిలుపునిచ్చారు. ప్రజల నుంచి సూచనలు సేకరించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 25తో సర్వే ముగుస్తుందని, అర్హులైన పౌరులు తమ సలహాలను www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆయన కోరారు.

News October 22, 2025

నల్గొండ డీసీసీకి షార్ట్ లిస్టు రెడీ..! పీఠం దక్కేదెవరికో?

image

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?

News October 22, 2025

మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.

News October 22, 2025

NZB: ‘తెలంగాణ రైజింగ్-2047’ సర్వేకు విశేష స్పందన

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్-2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.

News October 22, 2025

ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు

image

కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న ఆదికర్మ యోగి పథకం కింద క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనులకు గాను ఉత్తమ ప్రదర్శన విభాగంలో నల్గొండ జిల్లాకు గుర్తింపు లభించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్‌లను అభినందించారు.

News October 22, 2025

REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

image

2023 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.

News October 22, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.