India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం నంది నగర్‌లోని తన నివాసం వద్ద కేటీఆర్‌ని లగచర్ల బాధితులు కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. దీనికి సంబంధించి చెక్కును కేటీఆర్‌కు ఇచ్చారు. విరాళం అందించిన వారందరినీ కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభను చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదాలి ప్రణయ్ సత్తా చాటాడు. ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000కి 991 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి సదాలి బాపన్న-గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో యువకుడిని గ్రామస్థులు అభినందించారు.
కొచ్చిలో జరిగిన తొలి అఖిల భారత పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్ టోర్నీలో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ చూపారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీపడి12 మంది అధికారులు మొత్తం 18 పతకాలు గెలుచుకున్నారు. వాటిలో 2 బంగారు, 2 వెండి, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరిని డీజీపీ జితేందర్ అభినందించారు. ఈ విజయం పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం మంగళవారం వెలువడ్డాయి. ఫలితాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటినట్లు డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 4 శాతం ఉత్తీర్ణత పెరిగిందని, జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను తగు రీతిలో సత్కరించనున్నట్లు తెలిపారు..
దేవరకద్ర బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె ప్రశాంత్ రెడ్డితో కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. రూ.2కోట్ల 50లక్షలు సుపారి ఇచ్చి హత్యకు కుట్రచేసినట్లు డీకే అరుణ అనుమానం వ్యక్తంచేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డీజీపీని కోరారు.
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాల్లో 112 ఓటర్లకు మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 500 మంది సిబ్బంది, 250 మంది పోలీసులు బందోబస్తు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎన్నికల కారణంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఏప్రిల్ 23 సెలవు ఇవ్వగా.. జూన్ 14న హాజరుకావాలని సూచించారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని గిరిజన సంక్షేమ సైనిక్ స్కూల్ నుంచి ఒకే ఏడాదిలో 11 మంది అగ్నివీర్లో ఉద్యోగాలు సాధించారు. గత నెలలో ఇదే పాఠశాలకు చెందిన 8 మందికి జాబ్స్ వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో విడుత ఫలితాల్లో మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.
OU పరిధిలోని డిగ్రీ కోర్సులకు వన్ టైమ్ ఛాన్స్ పరీక్షా ఫీజులు స్వీకరిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫీజును వచ్చే నెల 19 వరకు చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in ను చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.