India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్‌ను ప్రారంభించారు. CSIR లాబొరేటరీ IICT, CCMB, NGRI సంయుక్తంగా నిర్వహించిన ఈ కాంక్లేవ్‌లో 70కు పైగా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులు, ప్రదర్శించాయి. పరిశోధన, ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
పోలీస్ శాఖలో 33 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.
వరంగల్లో బీఆర్ఎస్ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లేందుకు 35 బస్సులు, 300 బైకులు ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. మంగళవారం కడ్తాల్ లో పార్టీ నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. సభకు తరలి వెళ్లే ముందు ఉదయం అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. సెకండియర్‌లో హాసిని 994, ప్రియాంబిక 993, సంతోశ్ 991, జ్యోత్స్న 994, నవ్యశ్రీ 988, ఫస్టియర్‌లో భువనకృతి 468, పవిత్ర 468, హర్షిత్ 467, ప్రహర్ష 437, కరుణశ్రీ 437 ఉత్తమ రిజల్ట్ సాధించారని డైరెక్టర్ జగదీశ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ఫలితాలు సాధించగలిగామని డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించిందని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందరెడ్డి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం MPC విభాగంలో S.లహరి 468, హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో K.రుత్విక్ 996, శ్రీనిత్యరెడ్డి 995, రుత్విక 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటారని ఆయన ప్రకటించారు.
ఇంటర్మీడియట్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థి అదృశ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. సుజాతనగర్ మండలానికి చెందిన సుశాంత్ ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఫలితాల అనంతరం సుశాంత్ కనబడటం లేదని తల్లిదండ్రులు తెలిపారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం 9గంటలకు జరిగింది. ఈ సందర్భంగా రూ.20,69,829 నగదు, 12గ్రా. బంగారం, 305గ్రా. వెండి, 225 డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీ లభించాయి. ఈసారి గతేడాదితో పోలిస్తే రూ.2.94 లక్షలు అధికంగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరంభం నుంచి అదే సంచలనం ఏటేటా అదే ప్రభంజనం అది వాగ్దేవికే సొంతం అని కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫలితాలలో MPC- ఫస్టియర్ అమీనా 468 మార్కులు, BiPC ఫస్టియర్లో సంజన 436 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో నవనీత్ గౌడ్ 992, బైపీసీలో రబ్ ష 991 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.
మెదక్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థులు 49.21% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,028 పాస్ అయ్యారు. 3125 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 39.09 % కాగా, బాలికలు 57.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు పైచేయి సాధించడంతో జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.