India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో GST/కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనీయర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం కేసులో అరెస్టు చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి ₹30,000 లంచం డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ₹25,000కు ఒప్పుకున్నారు. సీబీఐ బృందం రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేసింది. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
మానేరు రివర్ ఫ్రంట్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను ఈ సందర్భంగా ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భూములు సేకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు.
కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, భారత జాతీయ రహదారి సంస్థ ప్రాంతీయ అధికారి శివశంకర్, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు నాగరాజు, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ మంగళవారం భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను యంత్రాంగం ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4,49,981 మంది ఓటర్లను గుర్తించారు. ఇందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది ఉన్నారు. ఇతరులు 16 మంది ఉన్నారు. జిల్లాలోని 20 మండలాలు ఉండగా వాటి పరిధిలో 473 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మహిళా ఓటర్లే అధికంగా ఉండగా ఎన్నికలో కీలకంగా వ్యవహరించనున్నారు.
సీపీ సీవీ ఆనంద్ గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల భద్రతా ఏర్పాట్లపై HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోనల్ ఆఫీసర్లు, లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో భద్రత ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 882 జలాశయాల్లో 3.49కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల దరఖాస్తు కోసం ఆహ్వానించిన విషయం తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నాటికి మూడు టెండర్లు నమోదైనట్లు సమాచారం. దీంతో గడువును ఈనెల 8వ తేదీ వరకు పెంచారు. ఆపై టెండర్లను ఖరారు చేశాక చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
1.గండీడ్-32,246, 2. మహమ్మదాబాద్ – 31,291, 3. రాజాపూర్ -21,772, 4. నవాబుపేట -40,193, 5. మిడ్జిల్ -25,128, 6. మూసాపేట-21,549, 7. మహబూబ్ నగర్ రూరల్-34,806, 8. కౌకుంట్ల -16,987, 9. కోయిలకొండ -52,175, 10. జడ్చర్ల – 40,861, 11.హన్వాడ -40,392, 12.దేవరకద్ర -26,239, 13. సీసీ కుంట -31,056, 14. భూత్పూర్ -27,080, 15. బాలానగర్ -33,437, 16. అడ్డాకల్ -24,370 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలంటూ పలు ప్రాంతాలకు చెందిన వారు ప్రజాభవన్‌లో వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో 243 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అత్యధికంగా 87 మంది ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 33, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 57, మిగతా సమస్యలపై 66 మంది వినతిపత్రాలు ఇచ్చారని ప్రజావాణి ఇన్‌ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉండగా ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.
HYDలో మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది. MGBS మెట్రో స్టేషన్‌లో ఈ నెల 15, 16న దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నగరంలో 3 PSKలు ఉండగా పాత బస్తీతో పాటు తూర్పుభాగంలో ఉండే ప్రజలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. MGBS మెట్రో స్టేషన్ మొదటి అంతస్తులో ఈ కార్యాలయం అందుబాటులోకి రానుంది. దీనిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయక మంత్రి గానీ ప్రారంభించనున్నారు.
# SHARE IT
Sorry, no posts matched your criteria.