India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 8న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 8వ తేదీన నిర్వహించనున్న మేళాకు హాజరుకావాలని సూచించారు.
క్రీడల పట్ల ఆసక్తి ఉన్న మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ రాధాకిషన్ తెలిపారు. ఈ నెల 6న దరఖాస్తు చేసుకోవాలని, పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే అర్హులని చెప్పారు. ఉద్యోగులు తమ సర్వీస్ సర్టిఫికేట్, తాజా ఐడీ కార్డుతో తమ పేర్లను జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈనెల 6న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్‌సాగర్, ట్యాంక్ బండ్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు RTC అధికారులు తెలిపారు. మెహదీపట్నం, బర్కత్‌పురా, కాచిగూడ, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్- 1,2 డిపోల నుంచి సర్వీసులు ఉంటాయని తెలిపారు. కాచిగూడ, రాంనగర్ నుంచి ఎల్బీనగర్, కొత్తపేట, ఇందిరాపార్క్, గచ్చిబౌలి, వనస్థలిపురం, రాజేంద్రనగర్- లక్డికాపూల్, పటాన్చెరు- లింగంపల్లి రాకపోకలు సాగించొచ్చాన్నారు.
బజార్‌ఘాట్‌లోని బంగారు ముత్యాలమ్మ ఆలయం ముందు ఏర్పాటు చేసిన 18 అడుగుల గణేశుడు తళుక్కున మెరిసిపోతున్నాడు. ఈ లంబోదరుడిని ప్రత్యేకంగా స్టోన్స్(వజ్రాల)తో అలంకరించారు. 50 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న ఈ గణనాథుడిని ఈసారి మొయినాబాద్‌లో తయారు చేయించారు. చవితి రోజున ప్రారంభమైన అన్నదానం శనివారం వరకు సాగనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అదేరోజు ఈ గౌరిపుత్రుడిని నిమజ్జనం చేయనున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు.
BRS ముఖ్యనేతలు హరీశ్ రావు, సంతోశ్‌రావులపై కవిత తీవ్ర విమర్శలు చేయడంపై TPCC అధికారిక ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి X వేదికగా స్పందించారు. ‘KCRకు వెన్నుపోటు పొడుస్తుంది.. హరీశ్, సంతోష్ రావులేనని కవిత చెప్పింది. వీరిద్దరు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని భవిష్యత్తులో ఎపిసోడ్లుగా కవితక్క బయటపెట్టనున్నారు. ఇకపై కవితక్క పేలుస్తుంది చూడండి లక్ష్మీ బాంబులు. హ్యాపీ దీపావళి పింకీస్’ అని ట్వీట్ చేశారు.
60 రకాల వైద్యపరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చే ATMను ఢిల్లీకి చెందిన క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అంకుర సంస్థ రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టుగా కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ATMలను ఏర్పాటు చేసింది. ఈ ATMలో అనేక రోగ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని, ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోగులకు ATMపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇది సక్సెస్ అయితే మరిన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఐటీ హబ్‌గా మారడంతో మాదాపూర్, గచ్చిబౌలిలో నివాస గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు గ్రామంగా ఉన్న మాదాపూర్, ఇప్పుడు భారీ గ్లాస్ టవర్లు, అపార్ట్మెంట్లతో నిండిపోయింది. నాలుగేళ్ల క్రితం రూ.23 వేలు ఉన్న 2BHK ఫ్లాట్ అద్దె ఇప్పుడు రూ.35 వేలకు చేరింది. గేటెడ్ కమ్యూనిటీలోని 3BHK అద్దె రూ.50 వేలకు పెరిగింది. ఐటీ కంపెనీల విస్తరణే ఈ అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణమని రియల్టర్ల అంచనా.
నిజామాబాద్ నగరపాలక సంస్థలో బుధవారం ACB అధికారులు దాడులు చేశారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ పండ్ల దుకాణానికి అనుమతి కోసం రూ.7 వేలు లంచం డిమాండ్ చేసిన RI శ్రీనివాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. రిటైర్డ్ జవాన్ ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYD, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రాబోయే 3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రజలకు అలర్ట్‌లు పంపించింది. 30- 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లాకి చెందిన ఇద్దరు క్రీడాకారులు నేహాల్ అఫ్సర్, ఐశ్వర్య ఎంపికయ్యారని జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బిలి నరేష్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు లూథియానా(పంజాబ్)లో ఈనెల 2 నుంచి నుంచి 9 వరకు జరిగే 75వ జూనియర్ నేషనల్స్‌లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.