Telangana

News September 3, 2025

కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు: తుమ్మల

image

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, ఆ ప్రభావం తెలంగాణ పైనా పడిందని చెప్పారు. గత నెల తెలంగాణకు రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదని, యూరియా పంపాలని పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు.

News September 3, 2025

మున్నేరు నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన సీపీ

image

గణేశ్ నిమజ్జన వేడుకల నేపథ్యంలో నగరంలోని కాల్వోడ్డు, మున్నేరు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ నీరజ, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనతో కలిసి ఈ పరిశీలనలో పాల్గొన్నారు. శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News September 3, 2025

APK ఫైల్స్‌తో జర జాగ్రత్త: ఆదిలాబాద్ SP

image

APK ఫైల్స్ పట్ల అప్రమత్తత తప్పనిసరి అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీఏ ఈ చలాన్ పేరుతో వాట్సాప్‌లో ఫేక్ అప్లికేషన్ చక్కర్లు కొడుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్‌లు ఇలాంటి వాటిని వెంటనే తీసివేయాలన్నారు. నకిలీ అప్లికేషన్ల ద్వారా డాటా చోరీ, సైబర్ క్రైమ్ జరిగే ఆస్కారం ఉందన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930ను సంప్రదించాలని సూచించారు.

News September 3, 2025

HYD: ‘నిమజ్జనానికి కరెంట్ కట్ కాకుండా చర్యలు’

image

SEP 6న జరగనున్న HYD ఖైరతాబాద్, ఇతర ప్రాంతాల గణపతుల నిమజ్జనానికి విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని TGSPDCL MD ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. 68 కంట్రోల్ రూమ్‌లు, 104 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. తీగల మరమ్మతులు, ఎర్తింగ్ పనులు పూర్తి చేసి, ప్యూజ్ బాక్స్‌ల వద్ద PVC పైపులు, ప్లాస్టిక్ షీట్లు అమర్చినట్లు వివరించారు.

News September 3, 2025

NLG: పంట నష్టం పై సర్వే..!

image

జిల్లాలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై అధికారులు సర్వే మొదలు పెట్టనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరి, పత్తి పంటలకు సంబంధించి 284 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనాలు తయారు చేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇవాల్టి నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహించనున్నారు.

News September 3, 2025

అత్యధికంగా తల్లాడ.. అత్యల్పంగా కొణిజర్ల

image

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం 8:30 వరకు గడచిన 24 గంటల్లో 82.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. తల్లాడ 10.2, చింతకాని 9.0, బోనకల్ 8.0, KMM(R) 6.8, KSMC 6.4, SPL 6.2, వేంసూరు 5.6, KMM(U), కల్లూరు 4.8, T.PLM 4.4, NKP 3.4, ఏన్కూరు 2.8, R.PLM 2.0, KMPL, PNBL 1.8, MDR 1.4, సింగరేణి, ఎర్రుపాలెం 0.8, MDGD 0.6, కొణిజర్ల 0.4 నమోదైంది.

News September 3, 2025

SRSP UPDATE.. 29 గేట్ల నుంచి నీటి విడుదల

image

ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 29 వరద గేట్ల ద్వారా లక్షా 51 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4500, ఎస్కెప్ గేట్ల ద్వారా 3500, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది.

News September 3, 2025

నకిలీ కాల్స్‌పై ఉద్యోగులకు ఏసీబీ సూచనలు

image

నకిలీ కాల్స్‌తో ఉద్యోగులను మోసగాళ్లు భయపెడుతున్న నేపథ్యంలో ACB హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ 91548 93428 నంబర్‌ నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు సైఫాబాద్ PSలో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. అధికారులు ఎప్పుడూ డబ్బులు అడగరు, నకిలీ కాల్స్ నమ్మొద్దు, డబ్బులు చెల్లించొద్దంటు ఏసీబీ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలంది.

News September 3, 2025

HYD: లంచం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

image

HYDలో GST/కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనీయర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం కేసులో అరెస్టు చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి ₹30,000 లంచం డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ₹25,000కు ఒప్పుకున్నారు. సీబీఐ బృందం రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేసింది. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

News September 3, 2025

KNR: మానేరు రివర్ ఫ్రంట్ పరిశీలించిన కలెక్టర్

image

మానేరు రివర్ ఫ్రంట్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను ఈ సందర్భంగా ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భూములు సేకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు.