Telangana

News September 22, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్లలో షార్ట్ సర్క్యూట్ తో కరెంట్ పోల్ దగ్ధం. @ గోదావరిఖని శివారు గోదావరి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో రెస్టారెంట్ భవనంలో అగ్ని ప్రమాదం. @ తంగళ్ళపల్లి మండల నూతన ఎస్సైగా రామ్మోహన్. @ పెగడపల్లి మండలం లో 500 గ్రాముల గంజాయి పట్టివేత. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు.

News September 22, 2024

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో భక్తుల సందడి

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది బోనాలు సమర్పించి గంగిరేగు చెట్లు వద్ద పట్నాలు వేశారు.

News September 22, 2024

నిండుకుండలా తలపిస్తున్న రామన్ పాడు జలాశయం

image

మదనాపురం రామన్ పాడు జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం శనివారం నాటికి 1,021 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 820 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 1,150 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 858 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్ రెడ్డి తెలిపారు.

News September 22, 2024

MBNR: చైన్ సిస్టమ్ అంటూ.. రూ.12కోట్లు బురిడీ

image

లోన్ యాప్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది మోసపోయారు. రూ.1.20లక్షలు డిపాజిట్ చేస్తే మరుసటి నెల నుంచి రూ.4,000 వడ్డీ చెల్లిస్తామంటూ చెప్పిన మాటలకు, డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయినట్లు బాధితులు వాపోయారు. చైన్ సిస్టమ్‌లో కల్వకుర్తిలోనే దాదాపు 1,000 మంది ఈ స్కీమ్‌లో చేరి రూ.12 కోట్లు డిపాజిట్ చేసినట్లు విచారణలో తేలింది. నిర్వాహకుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

News September 22, 2024

కొత్తగూడెం: గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి

image

కొత్తగూడెం డివిజన్ చాతకొండ అటవీ డిప్యూటీ రేంజ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చందావత్ సురేశ్ ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. మంచి కంటి నగర్లో నివాసం ఉంటున్న ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. డీఆర్ఓ సురేష్ మృతితో అటవీ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సురేశ్ కారేపల్లి మండల వాసిగా కుటుంబ సభ్యులు తెలిపారు.

News September 22, 2024

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

సెప్టెంబర్ 23 సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించడానికి రేపు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

News September 22, 2024

ఉమ్మడి MBNRకు భారీ వర్ష సూచన

image

మరికాసేపట్లో వనపర్తి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.

News September 22, 2024

షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తనను డీఎస్పీగా నియమించడం పట్లం హర్షం వ్యక్తం చేస్తూ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

News September 22, 2024

MBNR: స్కాన్ చేస్తే.. ఆర్టీసీ సేవలు అన్నీ ఒకే చోట

image

స్మార్ట్ ఫోన్‌తో కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీ సంస్థకు సంబంధించిన 10 రకాల యాప్‌లు ఒకే చోట కనబడతాయని RTC అధికారులు తెలిపారు. ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో ఒకసారి మన వివరాలు పొందుపరిస్తే చాలు ఎప్పుడైనా.. ఎక్కడైనా వినియోగించుకోవడం సులభమవుతుంది. ‘ప్రగతి రథం..ప్రజా సేవా పథం’ నినాదంతో విస్తృత అవగాహన కల్పించేందుకు ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా ఆయా డిపోల మేనేజర్లు, సంస్థ సిబ్బంది ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

News September 22, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ UPDATES

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు 17 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 19,318 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. వివిధ రూపాల్లో ప్రాజెక్టు నుంచి మొత్తం 21,833 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 9.562 TMCల నీరు నిల్వ ఉంది.