India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.
బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లి గ్రామ శివారులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. శివరాములు (46) మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యాదయ్య మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ పునరావాస కేంద్రంలో అన్ని రకాల మౌలిక వసతులను వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఉదండాపూర్‌లో పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించబోయే ప్రాంతాలను పరిశీలించారు. నిర్వాసితులకు ఫ్లాట్లు కేటాయించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.
పేద ప్రజలు, విద్యార్థులు, గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలకు పౌష్టికాహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాలో ఆహార భద్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జిల్లా పర్యటన అనంతరం దేవరకొండలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, ఉపాధి హామీ కార్యక్రమాల్లో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఎంలతో వెబెక్స్ నిర్వహించారు. మహిళా శక్తి, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ పథకంలో రాణించేలా చూడాలన్నారు.
నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంపై నగర యువత ఆసక్తి చూపారు. నిన్నటితో గడువు ముగియడంతో ఎంత మంది దరఖాస్తు చేశారనే విషయం లెక్కతేలింది. 1.3 లక్షల మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,04,556 దరఖాస్తులు ఆన్‌లైన్‌లోకి రాగా 26,992 మంది ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు.
భూ భారతి చట్టంపై మండలాల్లో అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆర్డీవోలు,తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులతో భూ భారతి చట్టం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు.
ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ, వీఆర్ఏ, వీఆర్వో, గ్రూప్ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం MBNR ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ఫ్రీ కోచింగ్ క్లాసులను ప్రారంభించనున్నారు. ఆయన సొంత నిధులతో బుధవారం ఉచితంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నారని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పర్యవేక్షకుడు మనోహర్ తెలిపారు.
జొన్నల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని ప్రతి జొన్న రైతుకు మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అమ్ముతున్న వివరాలను పొందుపరచాలని మార్కెటింగ్ శాఖకు ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించారు.
ఖమ్మం: మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి.శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో భవిత కేంద్రాల ఆధునీకరణపై ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భవిత కేంద్రాల ఆధునీకరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.