India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పట్టణంలో బుధవారం ఆయన నీట్, ఎంసెట్ కోర్సులో చేరిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో నీట్, ఎంసెట్ కోర్స్‌ను అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ బిడ్డలు ఎందులోనూ తక్కువ కాదని, ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారని ఆయన అన్నారు.
ఖమ్మం: యువ వికాసం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. జూన్ నెల నాటికి యూనిట్ల గ్రౌండింగ్ కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కుమారస్వామిని ఢిల్లీలో బుధవారం కోరారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ కుమార్ రెడ్డి, దామోదర్ రావుతో కలిసి బుధవారం ఆయన వినతిపత్రం ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడిన 17 మందిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ఇందులో 16 మందికి మేజిస్ట్రేట్ అబ్బోజు వేంకటేశం రూ.18,000 జరిమానా విధించారు. ఒక్కరికి జైలు శిక్ష పడగా పరకాల సబ్ జైలుకి పంపించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరికీ రూ.1000 ఫైన్ విధించినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు.
మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆస్తి పన్ను వసూళ్లను 100% అధిగమిస్తామని మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి.. ప్రతిరోజు ముమ్మరంగా వసూళ్లు చేపట్టారు. మార్చి నెలాఖరు నాటికి 100%వసూళ్లే టార్గెట్‌గా చేసిన ప్రయత్నాలు 47% శాతానికి పరిమితమై గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్ మున్సిపల్ శాఖ ఈసారి 50% కూడా చేయలేకపోయింది.
బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్, 14వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలపై మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 4న సి.జి.ఆర్.ఎఫ్(కస్స్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఫోరమ్) హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నట్టు మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏ.శంకర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి హాజరయ్యేవారు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు రసీదు తీసుకొని రావాలని సూచించారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాస్‌ను బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ బుధవారం కోరారు. అలాగే పాలమూరు విశ్వవిద్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అధ్యయన కేంద్రాన్ని కూడా నెలకొల్పాలన్నారు. ఈ అధ్యయన కేంద్రం ద్వారా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగించడానికి వీలవుతుందని వెల్లడించారు.
BRS పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే పరిస్థితిపై వివరించారు. భూములు ప్రైవేట్ పరుల చేతుల్లో వెళ్లకుండా 400 ఎకరాలు భూమిని కాపాడాలని కోరారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని కోరారు. విద్యార్థులుపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.