Telangana

News April 22, 2025

చందూర్: ఉరేసుకొని రైతు ఆత్మహత్య

image

చందూరు మండల కేంద్రంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్కల గోపాల్ రెడ్డి(46) పొలం పెట్టుబడి, పురుగుమందుల కోసం ఫర్టిలైజర్ షాపులో అరువుగా మందులు తీసుకువచ్చి డబ్బులు చెల్లించకపోవడంతో ఫర్టిలైజర్ యజమాని కోర్టును ఆశ్రయించారు. కోర్టు నోటీసు పంపించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ మహేశ్ చెప్పారు.

News April 22, 2025

మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి: ఉపకులపతి

image

పాలమూరు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ & బీసీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. వారి జీవితం, ఆచరణ, సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలిచాయని, ఈ మహానీయుల జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పుతుందని అన్నారు. ఎస్పీ D. జానకి, యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

News April 22, 2025

MBNR: రైతులు అధైర్య పడొద్దు: కలెక్టర్

image

అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. అడ్డాకులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆదివారం కురిసిన వర్షానికి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు.

News April 22, 2025

NZB: దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్ల (MRP, DRP)లను నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన దరఖాస్తుల ద్వారా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియామకం చేపడుతుందన్నారు.

News April 22, 2025

జాగ్రత్త.. పోలీసులమని చెబితే నమ్మకండి: ADB DSP

image

సివిల్ డ్రెస్సులో పోలీసులమంటూ వాహన తనిఖీలు నిర్వహించినా, విలువైన ఆభరణాలు అడిగినా, వారు పోలీసులు కాదనే విషయాన్ని గ్రహించలని ADB DSP జీవన్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. బేల మండలంలో నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ బంగారం అపహరించారని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటూ నూతన పద్ధతులలో మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల చెర నుంచి తప్పించుకోవాలని సూచించారు.

News April 22, 2025

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

News April 22, 2025

ధర్పల్లి: వడదెబ్బతో రైతు మృతి

image

ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వడదెబ్బతో కరక రాములు(65) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల తన పొలంలో యంత్ర సాయంతో పంట కోయించారు. యంత్రం వెళ్లలేని ప్రాంతంలో మిగిలిపోయిన పంటను ఉదయం నుంచి కోస్తూ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 22, 2025

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 694 మందిపై కేసు నమోదు

image

ఖమ్మం: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 673 మందితో పాటు 21 మంది మైనర్ల డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలోని 20 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 22, 2025

NLG: టార్పాలిన్లు లేక రైతన్నల పాట్లు

image

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో నానా పాట్లు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.

News April 22, 2025

రైతుల దగ్గరికే అధికారులు: కలెక్టర్ విజయేంద్ర

image

మే1 నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూభారతి చట్టం కింద వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. అడ్డాకులలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ పోర్టల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.