Telangana

News September 22, 2024

తొగుట: నిండుకుండలా మల్లన్నసాగర్‌

image

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్‌ పంపింగ్‌ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్‌ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్‌ నుంచి 5.5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించినట్లు తెలిపారు.

News September 22, 2024

వనపర్తి: ఇది ఈ జలాశయం ప్రత్యేకత.!

image

వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు సూచనతో ఇంజనీరు రామకృష్ణ రాజు కృషితో 1959లో 10 గ్రామాలకు సాగునీరు అందించేలా సరళా సాగర్ జలాశయాన్ని రూ.36 లక్షల వ్యయంతో నిర్మించారు. 23 అడుగుల్లో 491.37 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లు నీరు నిల్వ ఉండేలా సైఫన్లు ఏర్పాటు చేశారు. నీటి మట్టం రాగానే గాలి పీడనంతో ఎవరి ప్రమేయం లేకుండా జలాశయం కవాటాలు తెరుచుకొని 250 HP పీడనంతో నీరు బయటకు వస్తుంది. ఇది ఈ జలాశయం ప్రత్యేకత.

News September 22, 2024

సైబర్ నేరాలపై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష

image

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి రవాణాను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల తీరు ప్రశంసనీయమని చెప్పారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన నెలవారి సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News September 22, 2024

కంది: సెంట్రల్ జైలును తనిఖీ చేసిన జడ్జి

image

కందిలోని సెంట్రల్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ శనివారం అకస్మికంగా తనికి చేశారు. జైలులోని వంటగదిని పరిశీలించి నాణ్యతను చూశారు. జైల్లో ఉన్న ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. న్యాయవాది లేనివారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. జైలులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 22, 2024

NZB: విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న నాగన్న గారి బావి

image

లింగంపేట్ మండల శివారులోని అతి పురాతన ప్రసిద్ధిగాంచిన నాగన్న గారి మెట్ల బావి శనివారం సాయంత్రం విద్యుత్ దీపాలతో కాంతులీనుతుంది. శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాగన్న గారి మెట్ల బావి పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతో అధికారులు భావి వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున బావిని సందర్శించారు.

News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

News September 22, 2024

WGL: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024-25 వానాకాలం ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలన్నారు.

News September 22, 2024

MBNR: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి

image

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. కల్వకుర్తి పట్టణ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాహక్కు చట్టం, బాలల హక్కు చట్టం, ర్యాగింగ్ వంటి చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.

News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

News September 22, 2024

RRR సౌత్ అలైన్‌మెంట్ ఖరారుకు ప్రత్యేక కమిటీ

image

HYD శివారులో RRR దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. RR, VKB జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలు భాగంగా ఉంటారు. వీరితో పాటుగా ఇతర జిల్లాల కలెక్టర్లు, R&B, NHAI అధికారుల బృందం కలిసి విస్తృతంగా అధ్యయనం చేపట్టనుంది.