Telangana

News April 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

image

ఖమ్మం జిల్లాలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముదిగొండ (బాణాపురం)లో 41.5, నేలకొండపల్లిలో 41.3, ఎర్రుపాలెంలో 41.0, చింతకాని, మధిరలో 40.9, కామేపల్లి (లింగాల), కారేపల్లిలో 40.7, రఘునాథపాలెం, వేంసూరులో 40.3, వైరా 40.2, సత్తుపల్లి 40.0, పెనుబల్లి 39.9, ఖమ్మం అర్బన్ 39.7, తిరుమలాయపాలెం 39.4, ఖమ్మం (R) పల్లెగూడెం 39.2, తల్లాడ 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 21, 2025

ఖమ్మం: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు రేపు విడుదల చేయనుంది. జిల్లాలో మొదటి సంవత్సరంలో 17,783 మందికి గాను 17,515 మంది, రెండవ సంవత్సరంలో 16,476 మందికి గాను 16,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 21, 2025

వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి: మంత్రి

image

వడదెబ్బ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో‌ జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు.

News April 21, 2025

MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

image

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.

News April 21, 2025

రేపు ఇంటర్‌ రిజల్ట్స్.. రంగారెడ్డిలో వెయిటింగ్

image

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన రంగారెడ్డి జిల్లాలో 185 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 83,829 విద్యార్థులకు 81,966 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 71,684 విద్యార్థులకు 70,431 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT

News April 21, 2025

మధిర: వడదెబ్బకు సొమ్మసిల్లి వ్యక్తి మృతి

image

వడదెబ్బకు సొమ్మసిల్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిదానపురం గ్రామానికి చెందిన మేసిపోగు రత్తయ్య(33)మేకలు మేపేందుకు పొలానికి వెళ్లాడు. సోమవారం అధిక ఎండలతో మధ్యాహ్నం ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News April 21, 2025

రేపు ఇంటర్‌ రిజల్ట్స్.. HYDలో వెయిటింగ్

image

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన హైదరాబాద్ జిల్లాలో 244 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2Newsలో<<>> చెక్ చేసుకోండి.
SHARE IT

News April 21, 2025

రేపే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

image

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922, సెకండియర్‌లో 11,561 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం రేపటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST

News April 21, 2025

మెదక్: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

image

మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం సంబంధిత కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో తెలపాలని ఎస్పీ సూచించారు.

News April 21, 2025

కరీంనగర్: ధరణిలో పొరపాట్ల సవరణ అధికారం కలెక్టర్‌కే : పమేలా సత్పతి

image

ధరణిలో పొరపాట్లను సవరించడానికి కలెక్టర్ మినహా ఏ అధికారికి అవకాశం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం గంగాధరలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు వేలసంఖ్యలో పేరుకుపోయాయన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.