Telangana

News April 21, 2025

NLG: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 58,228 మంది (మొదటి సంవత్సరంలో 28,840 మంది, రెండవ సంవత్సరంలో 29,338 మంది) విద్యార్థుల భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 21, 2025

నిజామాబాద్: తేలనున్న 36,222 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 21, 2025

బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: ADB SP

image

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ADB SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మొత్తం 12 మంది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం అనంతరం రిపోర్టు దాఖలు చేయాలని సూచించారు.

News April 21, 2025

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

image

సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ADBలోని సాయుధ ముఖ్య కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులను నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ సక్రమంగా నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

News April 21, 2025

NZB: ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం: షబ్బీర్ అలీ

image

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ తన కుటుంబ అభివృద్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

News April 21, 2025

MBNR: ‘మోడల్ నీట్ పరీక్షను విజయవంతం చేయండి’

image

దేశ వ్యాప్తంగా మే 4న నీట్ పరీక్ష ఉంది. ఈ క్రమంలో ముందుస్తుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ నీట్ పరీక్ష ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 వరకు, 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12 వరకు MBNRలో నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్ అన్నారు. ఈ పేపర్ ఐఐటీ చుక్కా రామయ్య సంస్థ నుంచి వస్తుందని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News April 21, 2025

NLG: డిజిటల్ ఫీడ్ బ్యాక్‌కు కానరాని స్పందన

image

ఠాణాలకు వచ్చే పౌరులతో పోలీసుల వ్యవహారశైలి, వారందించే సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం సీఐడీ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చినా ప్రజల నుంచి స్పందన కానరావడం లేదు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి క్యూఆర్ కోడ్ పట్ల అవగాహన కల్పించకపోవడం వలన ఇది నిరుపయోగంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.

News April 21, 2025

NLG: 22 నుంచి మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే..!

image

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్-1, ఎల్-2, ఎల్-3) కేటగిరీలుగా విభజించారు. ఎల్-1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్-1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.

News April 21, 2025

CMRF స్కాం వెనుక RMPలదే ప్రధాన హస్తమా..?

image

ఖమ్మంలో CMRF స్కాం కలకలం రేపుతుంది. చికిత్స చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి CMRF నిధులను దుర్వినియోగం చేసిన 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో RMPలదే ప్రధానహస్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణకు సిద్ధం అవుతుంది. అలాగే ఖమ్మంలోని మరికొన్ని ఆసుపత్రులపై కూడా నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News April 21, 2025

BREAKING: తూప్రాన్: ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి 

image

మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో హల్దీ వాగులో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.