Telangana

News September 2, 2025

సికింద్రాబాద్: రెండు నెలల్లో 33 మంది అరెస్ట్

image

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రైళ్లను టార్గెట్ చేస్తూ రాళ్లు విసురుతున్న 33 మందిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 54 రైళ్లపై రాళ్లు రువ్వినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇంకా 30 మంది పరారీలో ఉన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. రైళ్లపై రాళ్లు రువ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 2, 2025

HYD నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

HYD చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్‌ను దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నవంబర్ 26 వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-తిరుపతి(07013) ట్రైన్ నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. అలాగే తిరుపతి-చర్లపల్లి (07014) రైలు నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
SHARE IT

News September 2, 2025

ఆనందోత్సాహాలతో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలి: కలెక్టర్

image

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య, ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించి మాట్లాడుతూ అపశృతులకు తావులేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.

News September 2, 2025

NZB: నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, CP, MLA

image

నిజామాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నారాయణ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రధాన రోడ్లు, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన గట్ల వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు, వినాయకుల బావి వద్ద ఏర్పాట్లు, తదితర అంశాలను పరిశీలించారు.

News September 2, 2025

ADB: ఈనెల 6న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

image

ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉద్యోగులు ఈనెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440765485, 9494956454 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News September 2, 2025

గణపతి పూజల్లో ADB జిల్లా అధికారులు

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నీతిక పంత్, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎఎస్పీ కాజల్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదానం కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

News September 2, 2025

18న రిమ్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

image

ADB రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న రిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని రిమ్స్ డైరెక్టర్ డా.జైసింగ్ రాథోడ్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు ఇతర వివరాలను rimsadilabad.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.

News September 2, 2025

MBNR: జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి- జిల్లా జడ్జి

image

జాతీయ రాష్ట్రన్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13న జిల్లాలోని అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి పాపిరెడ్డి అన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్, ఎలక్ట్రిసిటీ, ప్రీలిటిగేషన్, డబ్బు రికవరీ, కుటుంబ తగాదాలు, బ్యాంక్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఫ్రీ లిటిగేషన్ చెక్‌బౌన్స్ కేసులను రాజీకి వీలున్న కేసులు కక్షిదారులు వినియోగించుకోవలన్నారు.

News September 2, 2025

HYD: ఆలుమగల బీజీ లైఫ్.. ప్లే స్కూల్స్‌కు గిరాకీ

image

హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లే స్కూల్స్ పెరుగుతున్నాయి. తల్లులు ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లల్ని చూసుకోవడం, వేరే చోట పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వీటికి డిమాండ్ పెరిగింది. హైటెక్ సిటీ, మియాపూర్, అమీర్‌పేట్, KPHB లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పని చేసే తల్లిదండ్రులకు ఇవి చాలా సౌకర్యంగా ఉన్నాయి.

News September 2, 2025

HYD: YSRకు మంత్రి సీతక్క నివాళులు

image

మాజీ సీఎం దివంగత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్‌లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని అన్నారు.