Telangana

News April 15, 2025

ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు అరెస్ట్: సీఐ

image

ప్రియుడిని గొంతునులిమి హత్య చేసిన ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖమ్మం ఖానాపురం సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన లావణ్య(35) తన భర్తతో విడిపోయి సత్తుపల్లిలో రవిప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ నివాసముంటుంది. కాగా తరచూ రవి ప్రసాద్ లావణ్యతో మద్యం తాగి గొడవపడేవాడు. ఏప్రిల్ 6న మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ను గొంతునులిమి హత్య చేసిందని పేర్కొన్నారు.

News April 15, 2025

MBNR: విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా

image

MBNR పరిధిలో ఈతకు వెళ్లిన <<16098048>>ముగ్గురు యువకులు<<>> గల్లంతవగా అందులో ఒకరి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన విజయ్, అయ్యప్ప, మహమ్మద్ సమీపంలోని క్వారీ గుంతలోకి ఈత కొట్టేందుకు వెళ్లారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగిపోయారు. విజయ్ మృతదేహాన్ని అక్కడే ఉన్న కొందరు వెలికితీయగా మిగితా ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

News April 15, 2025

ADB: కత్తులతో పోస్టులు పెడుతున్నారా.. జాగ్తత్త

image

సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసమో.. హైప్ కోసం కత్తులు పట్టుకొని వీడియోలు పెడుతున్నారా.. జాగ్రత్త. ఇలాంటి వాటిపై ADB పోలీసులు దృష్టి సారించారు. ఎంతటి వారైనా తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. బైక్‌పై నోట్లో కత్తి పెట్టుకొని వీడియోలు పోస్ట్ చేసిన బంగారిగూడకు చెందిన సలీంపై ఇప్పటికే కేసుపెట్టారు. ఇలాగే వ్యవహరించిన పలువురిపై చర్యలు తీసుకున్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే ఉపేక్షించేది లేదంటున్నారు.

News April 15, 2025

మహబూబ్‌నగర్: మత్తు మందు ఇచ్చి.. అమ్మాయిపై అత్యాచార యత్నం!

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక  కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి  అమ్మాయిపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  

News April 15, 2025

చీకోటి ప్రవీణ్‌పై నల్గొండలో కేసు నమోదు

image

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్‌ కుమార్‌పై నల్గొండ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్గొండలో జరిగిన హనుమాన్‌ శోభాయాత్రలో పాల్గొన్న చీకోటి ప్రవీణ్‌ కుమార్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులొచ్చాయి. దీంతో అతనిపై 188, 153 సెక్షన్ల కింద నల్గొండ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

News April 15, 2025

హన్వాడ: ప్రజా ప్రభుత్వం రైతుల పక్షమే: ఎమ్మెల్యే

image

ప్రజా ప్రభుత్వం రైతుల పక్షంగానే ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హన్వాడ మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, ప్రతి గింజను కొనడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పించామని, బోనస్ అందించామన్నారు.

News April 15, 2025

NZB: నేడు ఉమ్మడి NZB జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

image

ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం NZB జిల్లా బోధన్‌లో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్ దేశాయి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు డిచ్‌పల్లిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 15, 2025

NZB: గంజాయి నిర్ములన ప్రతి ఒక్కరి బాధ్యత: సీపీ

image

గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సూచించారు. సోమవారం 6వ టౌన్ PS​ను సీపీ సాయి చైతన్య తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. సైబర్ మోసగాళ్లు, బెట్టింగ్ యాప్​ల నుంచి ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలన్నారు.

News April 15, 2025

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్

image

HYDలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ హోదాలో కలెక్టర్ డా. పి.శ్రీజ పాల్గొన్నారు. భూ భార‌తి పోర్టల్, ఇందిర‌మ్మ ఇండ్లు, వేస‌విలో తాగు నీటి ప్ర‌ణాళిక‌లపై సీఎం చర్చించినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ తెలిపారు. భూ భార‌తి పైలెట్ ప్రాజెక్టు స‌ద‌స్సుల‌ను ఆయా మండ‌లాల్లో ప్ర‌తి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం చెప్పారన్నారు.

News April 14, 2025

BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.

error: Content is protected !!