Telangana

News April 14, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 2 చిరుత పులుల కలకలం..!

image

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్గండ్ల గ్రామ సమీపంలోని దేవరగట్టులో 3 రోజులుగా 2 చిరుత పులులు సంచరిస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, అటవీ శాఖ అధికారులు స్పందించి సాధ్యమైనంత త్వరగా వాటిని బంధించాలన్నారు. స్థానిక గుట్టపై చిరుత పులులు సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

News April 14, 2025

జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

image

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

News April 14, 2025

జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

image

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

News April 14, 2025

మనోహరాబాద్: యువతి అదృశ్యం..!

image

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ‘కాళ్లకల్‌కు చెందిన మన్నె నాగలక్ష్మి (19) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అత్వెల్లి వద్దగల నేషనల్ మార్ట్‌లో పనిచేసేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళింది. రాత్రి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని’ చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు

News April 14, 2025

BREAKING: మహబూబ్‌నగర్‌లో తీవ్ర విషాదం

image

మహబూబ్‌నగర్‌లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు నీట మునిగారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు మునిగిపోతుండగా వాళ్లని కాపాడబోయి మరో యువకుడు కూడా మునిగిపోయాడు.

News April 14, 2025

‘విల్లా వెర్డే’ను ఆవిష్కరించిన సైబర్ సిటీ

image

హైదరాబాద్‌లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ సౌకర్యాలతో విల్లా వెర్డే ప్రాజెక్టును సైబర్ సిటీ సంస్థ సోమవారం ప్రారంభించింది. ఇది టెర్రస్ స్విమ్ స్పాలు, బయోఫిలిక్ డిజైన్‌లు, IGBC-సర్టిఫైడ్ గ్రీన్ ఆర్కిటెక్చర్‌తో 89 బెస్పోక్ విల్లాలను కలిగిన ప్రత్యేక ప్రాజెక్టని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 20ఏళ్ల అనుభవంతో ఈ ప్రాజెక్టు అందిస్తున్నామన్నారు. ది చార్ కోల్ ప్రాజెక్టుతో కొలాబరేషన్‌ను ఈ లాంఛ్ ఈవెంట్లో ప్రకటించారు.

News April 14, 2025

BREAKING.. కుషాయిగూడలో మర్డర్

image

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2025

BREAKING.. కుషాయిగూడలో మర్డర్

image

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2025

NZB: దళితులను అవమానించడమే ప్రజా పాలనా?: కవిత

image

దళితులను అవమానించడమే ప్రజా పాలనా? అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత X లో ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.

News April 14, 2025

SRSP సాగునీటి విడుదల నిలిపివేత

image

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. యాసంగి పంట కాలం పూర్తి కావడంతో నీటి విడుదల సోమవారం నిలిపివేసినట్లు డ్యామ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి ఈ నెల 9 వరకు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్​ పూర్తి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.44 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు.

error: Content is protected !!