India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి పథకం కింద 2024–25 విద్యా సంవత్సరానికి మెరిట్ ఉపకార వేతనాల కోసం కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.కృష్ణవేణి తెలిపారు. ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 10వ తరగతి, ఐటీఐ విద్యార్థులకు రూ.1000, పాలిటెక్నిక్‌కు రూ.1500, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు రూ.2000 చొప్పున వేతనాలు అందజేస్తామన్నారు.

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడుటకు, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ దృష్ట్యా ఇవాళ ఉదయం నుంచి జనవరి 31 సాయంత్రం 6 గంటల వరకు భారత పోలీస్ చట్టంలోని 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఐదుగురికి మించి గుంపులుగా కూడరాదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, ఇతర ప్రమాదకర వస్తువులతో తిరగరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించరాదన్నారు.
SHARE IT

మెదక్‌లో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాలకు బలవుతున్నారని, అవగాహన లోపం, అత్యాశే కారణమని పోలీసులు తెలిపారు. APK ఫైళ్లు, అనధికారిక లోన్ యాప్‌లు, పెట్టుబడి, ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

రైతులకు అన్యాయం చేసే కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.

నిజామాబాద్ 3 టౌన్ పరిధిలో రైతు బజార్ వద్ద గణేశ్ జువెలరీ షాప్‌లో నిన్న రాత్రి దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్రీ టౌన్ SI హరిబాబు తెలిపారు. బ్లూకోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండటం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దుండగులు పారిపోయరన్నారు. షాపు యజమాని వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. MHలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన ఓంకార్(24) ఖలీల్‌వాడీలోని సాయి అశ్విని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.

వీడీసీలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తే వీడీసీలపై కేసులు తప్పవన్నారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.