Telangana

News September 2, 2025

నేడు హైకోర్టులో KCR, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ

image

హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై నేడు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో విచారణ జరగనుంది. సీబీఐకు ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని KCR, హరీశ్‌రావు కోరుతున్నారు. నిన్న మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని లంచ్ మోషన్‌ని న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వం నిర్ణయం ఇవ్వాళ ఏజీ కోర్టుకు తెలుపనుంది.

News September 2, 2025

HYD సంస్థానంలో ఆ రక్తపుటేరుకు 78 ఏళ్లు

image

దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే.. నాటి HYD సంస్థానం (TG) నిరంకుశత్వంలో నలిగిపోయింది. రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా సామాన్యులే ఉద్యమాన్ని నడిపారు. దీనికి పరకాల ఘటనే సాక్ష్యం. సరిగ్గా 78 ఏళ్ల క్రితం 1947 SEP 2న అక్కడ జాతీయ పతాకావిష్కరణకు వేలాది మంది ర్యాలీగా బయలెల్లారు. రజాకార్లు విచక్షణారహితంగా వారిపై కాల్పులకు తెగబడగా 16 మంది అమరులయ్యారు. ఇది మరో జలియన్వాలాబాగ్‌ని తలపించింది.

News September 2, 2025

వరదల నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి

image

భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాస చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సిద్ధం చేసి, వెంటనే యూసీలను సమర్పించాలని ఆదేశించారు. వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రోడ్ల మరమ్మతులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించాలని సీఎం సూచించారు.

News September 2, 2025

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఖమ్మం విద్యార్ధి

image

ప్రతిభకు వయస్సు అడ్డుకాదని ఖమ్మం జిల్లాకు చెందిన బచ్చుపల్లి ఇషాన్ నిరూపించాడు. కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా 16 దేశభక్తి గీతాలను పియానోపై వాయించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. చిన్న వయస్సులోనే సాధనతో ఈ రికార్డును సాధించిన ఇషాన్, తన పాఠశాలకే కాకుండా ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఇషాన్ ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, స్థానికులు అభినందించారు.

News September 2, 2025

HYD: గ్రేటర్‌లో అత్యధిక వర్షపాతం

image

గ్రేటర్‌లో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్-1 నుంచి సెప్టెంబర్-1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 617.8 MM వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అత్యధికంగా అమీర్‌పేట, ఖైరతాబాద్‌లలో 56%, శేరిలింగంపల్లిలో 54% నమోదైంది.

News September 2, 2025

HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

image

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

News September 2, 2025

HYD: నేరాలు నివారించడానికి నిఘా: సీపీ

image

ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మధురానగర్ PSలో గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్, గొలుసు దొంగతనం తదితర నేరాలు నివారించడానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

News September 2, 2025

HYD: సకాలంలో విగ్రహాలను తరలించాలి: కమిషనర్

image

సకాలంలో గణేశ్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేశుడి ప్రతిమల ఊరేగింపు మార్గాల్లో నిర్దేశించిన గార్బేజీ పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులకు సహకరించాలని కోరారు.

News September 2, 2025

స్థానిక ఎన్నికలు.. ‘ఆమె’ కీలకం

image

గతనెల 28న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేయగా 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1042 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిని పరిష్కరించి తుది జాబితాను నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,14,124, పురుషులు 3,88,224, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26,180 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయంలో వీరే కీలకం కానున్నారు.

News September 2, 2025

HYD: గణేశ్ నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

image

గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.