Telangana

News April 14, 2025

అలర్ట్: కరీంనగర్ జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదు

image

KNR జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గడచిన 24 గంటల్లో జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.0°C నమోదు కాగా, గంగాధర 42.9, రామడుగు 42.8, జమ్మికుంట 42.7, చిగురుమామిడి 42.6, కరీంనగర్ 42.5, వీణవంక 41.6, గన్నేరువరం 41.5, తిమ్మాపూర్ 41.4, ఇల్లందకుంట, కరీంనగర్ రూరల్ 41.2, చొప్పదండి 40.9, శంకరపట్నం 40.5, కొత్తపల్లి 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్ 40.2°C గా నమోదైంది.

News April 14, 2025

NLG: పత్తి సాగు ప్రశ్నార్ధకమేనా?

image

నల్గొండ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవిచూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్‌ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 14, 2025

ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఆ మండలంలోనే గరిష్ఠం

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం అత్యధికంగా ఖానాపురం మండలంలో 42.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కారేపల్లి, ముదిగొండ, కామేపల్లి 41.9, నేలకొండపల్లి, పెనుబల్లి 41.8, చింతకాని 41.7, ఎర్రుపాలెం 41.6, వైరా 41.2, రఘునాథపాలెం 40.7, కొణిజర్ల 40.6, వేంసూరు 40.3, ఖమ్మం (R) పల్లెగూడెం 40.4, సత్తుపల్లి, బోనకల్ 39.3, ముదిగొండ 40.6, కూసుమంచి 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

News April 14, 2025

MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న మహమ్మదాబాద్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. జంగంరెడ్డిపల్లికి చెందిన ఆనంద్(24) HYDలో కూలీ పనిచేసుకుని జీవిస్తున్నాడు. శనివారం సొంతూరుకు వచ్చాడు. మద్యానికి బానిసైన ఆనంద్.. తనకంటూ ఎవరూ లేరని తనలో తాను కుమిలిపోవటం చేస్తుండేవాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

News April 14, 2025

HYD: ఇంజినీరింగ్ కాలేజీల్లో రైడ్స్.. టెన్షన్!

image

సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలల నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2 వరకు JNTUH నిజ నిర్ధారణ కమిటీ (FFC) తనిఖీలు నిర్వహించనుంది. ఆయా కళాశాలల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 120 మంది ప్రొఫెసర్లతో తనిఖీల కోసం 25 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది. JNTUH పరిధిలో 137 ఇంజినీరింగ్, 72 ఫార్మసీ, 6 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News April 14, 2025

మెదక్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News April 14, 2025

కోటపల్లి: నవదంపతుల సూసైడ్

image

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 14, 2025

వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

image

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2025

HYD: ఇంజినీరింగ్ కాలేజీల్లో రైడ్స్.. టెన్షన్!

image

సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలల నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2 వరకు JNTUH నిజ నిర్ధారణ కమిటీ (FFC) తనిఖీలు నిర్వహించనుంది. ఆయా కళాశాలల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 120 మంది ప్రొఫెసర్లతో తనిఖీల కోసం 25 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది. JNTUH పరిధిలో 137 ఇంజినీరింగ్, 72 ఫార్మసీ, 6 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News April 14, 2025

NZB: గ్యాంగ్ వార్.. కత్తిపోట్లు

image

నిజామాబాద్ నగరంలోని హైమద్‌పుర కాలనీలో ఆదివారం అర్ధరాత్రి రెండు గ్రూపులు గ్యాంగ్ వార్‌కు దిగాయి. స్థానిక యువకులకు మధ్య జరిగిన ఘర్షణ కాస్త కత్తి పోట్లకు దారి తీసింది. సాజీద్ అనే వ్యక్తితోపాటు మరో యువకుడికి కత్తిపోట్లు తగిలాయి. ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గంజాయి తాగే అడ్డా విషయంలో ఈ గ్యాంగ్ వార్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!