Telangana

News April 14, 2025

పెనుబల్లి: భార్యాభర్తలను ఢీకొట్టిన బైక్

image

పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడేనికి చెందిన బలుసుపాటి వెంకటమ్మ, సీతయ్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్లివస్తుండగా బైక్ పంచర్ అయ్యింది. అదే సమయంలో సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన చాపల రఘు మరో ఇద్దరితో కలిసి బైక్‌పై వస్తూ నడుచుకుంటూ వస్తున్న భార్యాభర్తలను శాంతినగర్ బ్రిడ్జీ రైల్వే వద్ద ఢీకొన్నాడు. దీంతో వారికి తీవ్రగాయాలవ్వగా.. మెరుగైన వైద్యంకోసం‌ వారిని ఖమ్మం తరలించారు.

News April 14, 2025

KMR: కొబ్బరి చిప్పలోనే నీళ్లు, చాయ్ తాగుతున్న పెద్దాయన..!

image

KMR జిల్లా పెద్దకొడప్గల్ వాసి రామయ్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా నీళ్లు, చాయ్ తాగడానికి గ్లాసులు ఉపయోగిస్తారు. కానీ ఈయన మాత్రం భిన్నంగా కేవలం కొబ్బరిచిప్పనే వినియోగిస్తున్నారు. రోడ్డు పక్కన చాయ్ కొట్టుకు వెళ్లినా, అక్కడ కూడా తన వెంట తెచ్చుకున్న కొబ్బరి చిప్పలోనే చాయ్ తాగడం విశేషం. ఆధునిక యుగంలోనూ తమ ప్రత్యేక అలవాట్లను కొనసాగిస్తున్న ఈ పెద్దాయన ప్రత్యేక వ్యక్తిగా నిలుస్తున్నారు.

News April 14, 2025

సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు.. జూపార్క్ ఓపెన్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్‌కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.
SHARE IT

News April 14, 2025

నేటి ఖమ్మం జిల్లా ముఖ్యాంశాలు..!

image

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ∆} నేలకొండపల్లిలో రైతు నేస్తం కార్యక్రమం ∆} ఖమ్మం నగరంలో ఎంపీ రామ సహాయం పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} సత్తుపల్లిలో నేడు పవర్ కట్

News April 14, 2025

ఆదిలాబాద్: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News April 14, 2025

జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

బాదేపల్లిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పాతబజార్‌కు చెందిన అంజమ్మ(73) శనివారం రాత్రి తన చిన్న కొడుకు నగేశ్ ఇంట్లో నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట రోడ్డుపై శవమై కనిపించింది. ఇంట్లో పడుకున్న ఆమె రోడ్డుపై శవమై పడి ఉండటంతో కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈమేరకు కేసు నమోదైంది.

News April 14, 2025

సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు.. జూపార్క్ ఓపెన్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్‌కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.

News April 14, 2025

NLG: మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నల్గొండ వాసి!

image

నల్లగొండ వాసికి అత్యున్నత పదవి లభించింది. హైకోర్ట్ న్యాయమూర్తిగా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. NLGకి చెందిన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.

News April 14, 2025

NLG: నిందితుల కోసం పోలీసుల గాలింపు

image

నల్లగొండ జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన మణికంఠ ఫొటో కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేశ్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు నాలుగు టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి. టూటౌన్ పోలీసులు అనుమానితులతో పాటు హత్యకు ముందు మృతుడితో ఫోన్లో మాట్లాడిన వారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.

News April 14, 2025

NZB జిల్లాలో ఈనెల 15న మంత్రి జూపల్లి పర్యటన

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 15న ఉమ్మడి NZB జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10.30 గంటలకు KMR జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ, సివిల్ సప్లై, తదితర శాఖలపై సమీక్షిస్తారు. అనంతరం ఆయన NZB జిల్లా ఆర్మూర్‌కు చేరుకొని, సన్నం బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేస్తారు. సా. 4 గంటలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు. గుండ్ల చెరువుకు మిని ట్యాంక్ బండ్‌గా అభివృద్ధికి పునాది రాయి వేయనున్నారు.

error: Content is protected !!