Telangana

News September 28, 2024

కామారెడ్డి డాక్టర్‌ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

image

గాంధారిలో పనిచేసే ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్‌ను మహారాష్ట్ర పోలీసులు లింగ నిర్ధారణ కేసులో శుక్రవారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ మండలానికి చెందిన ఓ గర్భిణికి లింగనిర్ధారణ చేయడంతో ఉద్గీర్‌లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు దానికి కారణమైన డా.ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం మహారాష్ట్రకు తరలించారు.

News September 28, 2024

2 నెలలు ఆగండి.. సబ్సిడీ పడుతుంది: చొప్పదండి MLA

image

మల్యాల రైతు వేదికలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు అందజేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. త్వరలో తులం బంగారం హామీ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందరికీ పడుతుంది కదా అని అడగగా? చాలా మంది తమకు పడటం లేదని చెప్పడంతో 2 నెలలు ఆగండి.. అందరికీ పడుతాయన్నారు.

News September 28, 2024

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో మెదక్ ఎంపీకి చోటు

image

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీ సభ్యుడిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు చోటు దక్కింది. ఈ కమిటీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులుంటారు. మొదటి సారిగా మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన రఘునందన్ రావు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

News September 28, 2024

MBNR: త్వరలోనే వారికి ఇందిరమ్మ ఇళ్లు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 45,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. ఇప్పటికే ప్రజా పాలన పేరుతో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గాంధీ జయంతి తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మార్గదర్శకాలు రాగానే గుడిసెల్లో నివాసముండే వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

News September 28, 2024

అటవీ అధికారులపై దాడి.. ములుగు SP హెచ్చరిక

image

తాడ్వాయిలో <<14206753>>అటవీ శాఖ అధికారులపై దాడి<<>> కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసినా, వారి విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పీడీ యాక్ట్, రౌడీషీట్ సైతం నమోదు చేస్తామన్నారు.

News September 28, 2024

KMM: సీతారామ ప్రాజెక్ట్ సమీక్షలో పాల్గొన్న మంత్రులు

image

సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతి పై హైదరాబాద్‌లోని జలసౌధలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు.

News September 28, 2024

NLG: ‘చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’

image

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. నల్గొండ పట్టణంలోని చర్లపల్లి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో చట్టాల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన లేక ఎంతో మంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ అపర్ణ, పారా లీగల్ వాలంటరీ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులున్నారు.

News September 28, 2024

పిట్లం: చిన్న నాటి బాల్యం… అమూల్యం..!

image

పిట్లంలోని అంగన్వాడి 7 వ కేంద్రంలో ఆట పాటలు, చదువుతో అలసి పోయిన చిన్నారులు మధ్యాహ్నం ఆహారం తీసుకున్నాక గాఢ నిద్రలోకి జారుకున్నారు. రోజూ మాదిరిగానే పూర్వ ప్రాథమిక టీచర్ ప్రవీణ జ్యోతి బాల తరగతులు చేపట్టారు. అనంతరం పిల్లలు ఆహారం తీసుకొని టీచర్ సూచనల మేరకు నిద్రించారు. ఎల్లలు కల్లలు ఎరుగని బాలలు సుఖమెరగకుండా చక్కగా కొద్ది సేపు పడుకొని లేచారు.

News September 28, 2024

ఆదిలాబాద్: DEGREE విద్యార్థులకు గమనిక

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ఆదిలాబాద్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం పేర్కొన్నారు. అక్టోబర్ 5 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు అవకాశం ఇచ్చారని తెలిపారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి.. ఫీజు చెల్లించండి.
>>SHARE IT

News September 28, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.84,148 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.30,366, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.32,670, అన్నదానం రూ.21,112 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.