India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ కలెక్టరేట్‌లో రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులంతా ఆ సదస్సులకు హాజరు కావలసిన ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉమ్మడి NLG జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు 6వేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బీహార్, UP, ఢిల్లీ వాళ్లు పని చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 16,305 మంది విద్యార్థులు 73 కేంద్రాల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీసులను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గుడి తండాకి చెందిన మాలోత్ అనిత, గణేశ్‌ల చిన్న కుమారుడు చిన్నా శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ గేర్లను మార్చగా న్యూట్రల్‌లోకి వెళ్లింది. వెనక పల్లంగా ఉండటంతో ట్రాక్టర్ టైర్ చిన్నాపై నుంచి వెళ్లింది. గాయపడిన చిన్నాను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కార్పొరేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
KNR జిల్లాలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు శ్రమ్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకట రమణ సూచించారు. భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు సహా అన్ని వర్గాల కార్మికులకు సామాజిక భద్రత అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
కరీంనగర్‌లో డా. ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో టెట్ అభ్యర్థుల కోసం ఉచితంగా విన్నర్స్ ఆన్‌లైన్ యాప్ విడుదల చేశారు. రాష్ట్రస్థాయిలో పేరు గాంచిన ఫ్యాకల్టీ లెక్చర్లు అందించనున్న ఈ యాప్ ద్వారా రూ.80 లక్షల విలువైన క్లాసులు అభ్యర్థులకు ఫ్రీగా లభించనున్నాయి. ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకొని ఆప్‌ను వీక్షించవచ్చు. ఎన్నికల్లో ఓడినా, నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు.
జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 21,120, ఎస్టీ కార్పొరేషన్‌కు 11,515, బీసీ కార్పొరేషన్‌కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 253 దరఖాస్తులు వచ్చాయి.
తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.