Telangana

News September 21, 2024

HYD: 5 మార్గాల్లో 78.6 కి.మీ మెట్రో

image

HYD నగరంలో రెండో దశ మెట్రో ట్రైన్ 5 మార్గాల్లో కలిపి అధికారులు 78.6 కి.మీ ప్రతిపాదించారు. 60కి పైగా స్టేషన్లు రానున్నట్లు తెలిపారు. రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాలపై ఇప్పటికే పలు మార్లు సీఎం చేసిన సూచనల మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను వేరువేరుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు.

News September 21, 2024

తిరుమల లడ్డూ కల్తీపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ రఘునందన్

image

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దారుణమని, బాధ్యులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.ఈ మేరకు ఎంపీ Xలో పోస్టు చేశారు. పవిత్రతకు మారుపేరైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ చేయడం క్షమించరాని నేరం అన్నారు. 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలన్నారు.

News September 21, 2024

నర్సాపూర్: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజీ చేయదగ్గ కేసులను రాజీ కుదురు కుదుర్చుకోవచ్చని నర్సాపూర్ న్యాయమూర్తి కే అనిత సూచించారు. నర్సాపూర్ కోర్టు ఆవరణలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పోలీస్ అధికారులు హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారీలు రాజి కుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

News September 21, 2024

జగిత్యాల: మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్ష

image

జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించడానికి, అన్ని జీవనోపాధి అంశాలలో వారిని బలోపేతం చేయడానికి మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మహిళా శక్తి కింద వచ్చే ఐదేళ్లలో మైక్రో ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ద్వారా ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు.

News September 21, 2024

ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా

image

అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.

News September 21, 2024

NLG: కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు!

image

నూతన రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,07,259 రేషన్ కార్డులున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వారి కల నెరవేరబోతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 21, 2024

ఉట్నూర్: నేడు మంత్రి సీతక్క రాక

image

ఈనెల 21న శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి సీతక్క రానున్నట్లు ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్ తెలిపారు. మంత్రితో పాటు ఆత్రం సుగుణక్క, బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గజేందర్, అదిలాబాద్ శ్రీనివాస్ రెడ్డి, సత్తు మల్లేశ్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

News September 21, 2024

ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తాం: భట్టి

image

శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం (SLBC) ప్రాజెక్టును శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అనంతరం అధికారులతో భట్టి సమీక్షించారు. ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. అటు నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వితే 14 కోట్లు నిధులు అవసరమవుతాయని, 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉందని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

News September 21, 2024

నాగన్న బావి పునరుద్ధరణ పనులను ప్రారంభించిన కలెక్టర్

image

లింగంపేటలో పరంపర ఫౌండేషన్, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు.

News September 21, 2024

MBNR: రేపే సవరణ.. 28న తుది జాబితా

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ వరకు తెలియజేయవచ్చని, 28న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని డీపీఓ పార్థసారథి తెలిపారు.