India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. HYD శాసనమండలి వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ 34 శాతం బీసీలకు రిజర్వేషన్ తేవాలని చూస్తే, గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కేసు వేసి ఆపాడని, నేడు మరో గోపాల్ రెడ్డి పుట్టాడా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాలు అమలు చేయాలన్నారు.
హైదరాబాద్ పటాన్‌చెరులోని నీలం మధు నివాసంలో కరీంనగర్ జిల్లా TMPS నాయకులు ఆయనను కలిశారు. కూనచల మహేందర్, కీసర సంపత్, పెసరు కుమారస్వామి, అరిగే ప్రభాకర్, జోడు బాలరాజు, భూమ ప్రవీణ్ పాల్గొన్న ఈ సమావేశంలో ముదిరాజ్ సమాజ సమస్యలు, సంక్షేమం, రాజకీయ అభివృద్ధిపై చర్చించారు. సమాజ అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
HYD బుద్ధభవన్‌లో సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు అందాయన్నారు. వర్షాకాలం వరద ముప్పుపై ఫిర్యాదులు, కాలువల ఆటంకాలు తొలగించాలంటూ వినతులు చేశారన్నారు. సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.
డ్యూటీలోని వనస్థలిపురం పోలీసులపై దాడి చేసిన వారిని రిమాండ్‌కు తరలించారు. ఈరోజు తెల్లవారుజమున 2 గంటలకు నిబంధనలకు విరుద్ధంగా చింతలకుంట దగ్గర టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసి ఉండగా కానిస్టేబుల్ R.లింగం, హోంగార్డ్ M.యాదయ్య మూసివేయమని చెప్పారు. అప్పుడే వచ్చిన బోడుప్పల్ వాసులు రాపోలు రాకేశ్, గుండవెల్లి ప్రసాద్ కలిసి పోలీసులపై దాడి చేసి బూతులు తిట్టారు. వారితోపాటు టిఫిన్ సెంటర్ యజమాని వనం పవన్‌ను అరెస్ట్ చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 54 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు.
మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల సమస్యలను విని వాటికి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు
ఈ నెల 3న మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం వేములలో ఎస్‌జీడీ పరిశ్రమ రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభాస్థలాన్ని, ఇతర ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ జానకి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు.
తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రాతిపదికన పనిచేస్తున్న బోధన, ఇతర సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు ఉద్యోగుల వేతనాలు మంజూరు చేయడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి, పెండింగ్‌లోని వేతనాలను విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ అన్నారు. ఈరోజు HYDలోని సెక్రటేరియట్‌లో వారు మాట్లాడారు. తెలంగాణను దేశంలో అత్యంత ఇష్టపడే గమ్యస్థానంగా నిలపడమే నూతన పర్యాటక విధాన లక్ష్యమని, వచ్చే ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15,000కోట్ల పెట్టుబడులు ఆకర్శిస్తామని, కనీసం 3లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పిస్తామన్నారు.
MBNRలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 13 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టేలా సూచనలు ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి అభ్యర్థనపై పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజలకు న్యాయం జరిగేలా కట్టుబడి ఉంటామన్నారు.
Sorry, no posts matched your criteria.