Telangana

News July 13, 2024

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన పోచారం

image

కోటగిరి మండల కేంద్రంలో లబ్ధిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. 91 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 22 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, పోతంగల్ ఎమ్మార్వో మల్లయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు శంకర్, లక్ష్మణ్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

News July 13, 2024

ఏటూరునాగారం: ఆటోను ఢీకొన్న కంటైనర్.. ముగ్గురి మృతి

image

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని హైవే ట్రీట్ ఫంక్షన్ హాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం వైపు వస్తున్న ఓ కంటైనర్ ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సు ద్వారా తరలించారు. ఆటో వాజేడు మండలానికి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 13, 2024

ఆసిఫాబాద్‌లో ఐదుగురు జూదరుల అరెస్ట్

image

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఐదుగురు జూదరులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాణాప్రతాప్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ మండలం బూరుగూడ శివారులో జూదం ఆడుతున్నరనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద రూ.13,800 నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు వెల్లడించారు.

News July 13, 2024

హెచ్ఎండీఏకు త్వరలో కొత్త సిబ్బంది

image

హెచ్ఎండీఏకు జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రణాళిక విభాగంలో పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చురుకుగా పనిచేసే కొందరు పీవోలు, ఏపీవోలు, జేపీవోలు, మిగతా సిబ్బందిని గుర్తించి వారికి హెచ్ఎండీఏలోని వివిధ జోన్లలో బాధ్యతలు కేటాయించనుంది. త్వరలో చేపట్టనున్న బదిలీల్లో ఈ నిర్ణయం తీసుకోనుంది.

MBNR: కాకతీయుల చరిత్రకు సాక్ష్యం కందూరు క్షేత్రం

image

అడ్డాకుల మండలం కందూరు ప్రకృతి ఒడిలో వెలసిన రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం వద్ద సహజసిద్ధంగా పెరిగిన 27 కదంబవృక్షాలు ఉన్నాయి. ఇవి 27 నక్షత్రాలకు ప్రతీకలుగా భక్తులు భావిస్తారు. ఈ వృక్షాల కింద స్వామివారికి భక్తితో నైవేద్యం వండి సమర్పిస్తారు. ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

News July 13, 2024

KMM: నిధులు లేక పడకేసిన పంచాయితీ పాలన

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు నిధుల లేమితో తలడిల్లుతున్నాయి. ఏడాదిగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, ఆరు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసిన వెంటనే ఫిబ్రవరి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. నిధుల కొరతతో పల్లెల బాగోగులు ప్రత్యేక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

News July 13, 2024

సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి లేఖ

image

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో 61 ఏళ్లు పైబడిన 3,797 మంది వీఆర్ఏల స్థానంలో దశాబ్ద కాలంగా విధులు నిర్వహిస్తున్న వారి వారసులను నియమించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని వారి నివాసంలో కలిశారు. అనంతరం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.

News July 13, 2024

HYD: రేపు మున్నూరుకాపుల వివాహ పరిచయ వేదిక

image

మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో మున్నూరుకాపు యువతీయువకుల కోసం వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల14వ తేదీ ఆదివారం మ్యాడం అంజయ్య హాల్లో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిచయ వేదికను తెలంగాణలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.